Rocket Attack On PS: పంజాబ్ లోని పోలీస్ స్టేషన్ పై రాకెట్ దాడి..  రాష్ట్రవ్యాప్తంగా అలర్ట్ ప్రకటించిన ఉన్నతాధికారులు..  ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాదులు లేదా ఐఎస్ఐ పనేనని అనుమానాలు
Rocket (Credits: ANI)

Newdelhi, Dec 10: రాకెట్ దాడితో (Rocket Attack) పంజాబ్ (Punjab) ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక్కడి పాకిస్థాన్ సరిహద్దులకు దగ్గర్లో ఉన్న తర్న్ తరణ్ (Tarn Taran) లోని ఓ పోలీస్ స్టేషన్ పై ఈ రాకెట్ దాడి జరిగింది. తేలికపాటి రాకెట్ తో ఉగ్రవాదులు దాడి చేశారని పోలీసులు (Police) తెలిపారు. ఈ దాడిలో సిబ్బందికి ఎలాంటి హానీ జరగలేదని వివరించారు. ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాదులు లేక ఐఎస్ఐ ఉగ్రవాదులు  ఈ రాకెట్ దాడికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాది హర్విందర్ సింగ్ అలియాస్ రిండా సొంతూరులో ఈ రాకెట్ దాడి జరిగింది.

అమెరికా ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ గ్రాంట్ వాల్ కన్నుమూత.. సాకర్ ప్రపంచ కప్ కవరేజీ చేస్తుండగా ఘటన

రిండా మరణించినట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తలను పోలీసులు ధ్రువీకరించలేదు. ఈ నేపథ్యంలో రిండా ప్రాణాలతో ఉండాలని ఐఎస్ఐ కోరుకుంటోందని, రిండాకు హాని తలపెట్టొద్దనే హెచ్చరిక పంపేందుకే తాజా రాకెట్ దాడి జరిపినట్లు ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. కాగా, పోలీస్ స్టేషన్ పై రాకెట్ దాడి నేపథ్యంలో పంజాబ్ లో అలర్ట్ ప్రకటించారు. పోలీసులు అప్రమత్తమయ్యారు.