Air India Express Flights Cancelled: ఎయిర్ ఇండియాలో సంక్షోభం, ఒకేసారి సిక్ లీవ్ పెట్టిన ఉద్యోగులు, ఏకంగా 70 విమానాలు ర‌ద్దు
Representative Image (Photo Credit: Facebook/ Air India)

New Delhi, May 08: ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ లో (Air India Express)  సిబ్బంది సంక్షోభం నెల‌కొంది. పెద్ద ఎత్తున ఉద్యోగులు సిక్ లీవ్ పెట్టారు. దాంతో 70కి పైగా ఇంట‌ర్నేష‌న‌ల్, డొమెస్టిక్ విమానాలు ర‌ద్ద‌య్యాయి. మంగ‌ళ‌వారం రాత్రి ఉద్యోగుల్లో చాలా మంది సిక్ లీవ్ (Sick Leave) పెట్టారు. దాంతో ఉద‌యం వెళ్లాల్సిన దాదాపు 70 విమానాలు ర‌ద్దు అయ్యాయి. ఒకేసారి ఇన్ని విమానాలు ఆగిపోవ‌డంతో సివిల్ ఏవియేష‌న్ (Civil Aviation authorities) అధికారులు ఆందోళ‌న చెందుతున్నారు.

 

ఎందుకిలా జ‌రిగింద‌ని ఆరా తీస్తున్నారు. ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ కు సంబంధించిన ఉన్న‌తాధికారుల‌ను సంప్ర‌దించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే ఆందోళ‌న‌లో భాగంగానే ఉద్యోగులంతా ఇలా సిక్ లీవ్స్ పెట్టార‌ని భావిస్తున్నారు. గ‌త రాత్రి నుంచి విమానాల రాక‌పోక‌ల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్న‌ట్లు ఎయిర్ ఇండియా ప్ర‌తినిధి తెలిపారు. ఎందుకు ఉద్యోగులు ఒకేసారి సిక్ లీవ్‌లో వెళ్లారో తెలియ‌డం లేద‌ని, ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని ప్ర‌తినిధి వెల్ల‌డించారు. విమాన‌ల ర‌ద్దు వ‌ల్ల ఇబ్బందులు ప‌డ్డ‌వారికి రిఫండ్ ఇవ్వ‌నున్న‌ట్లు చెప్పారు. లేదంటే జ‌ర్నీ రీషెడ్యూల్ చేయ‌డం జ‌రుగుతుంద‌ని ప్ర‌తినిధి తెలిపారు.