New Delhi January 06: ఐదు రాష్ట్రాల ఎన్నికలు(5 States Elections) దగ్గర పడుతున్న సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం(election commission of India) కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్(Parliament), అసెంబ్లీ(Assembly) స్థానాల్లో పోటీ చేసే అభ్యర్ధుల ఖర్చపై ఉన్న పరిమితిని(expenditure limit for candidates) పెంచింది. రానున్న ఎన్నికలకు కూడా ఇవి వర్తిస్తాయని స్పష్టం చేసింది.
కొత్త నిబంధన ప్రకారం పార్లమెంటరీ నియోజకవర్గాల అభ్యర్థులు 2014 వరకూ 70 లక్షలు ఖర్చు పెట్టుకోవచ్చన్న నిబంధన ఉండేది. ఇకపై వీరు 95 లక్షలు ఖర్చు చేసుకోవచ్చు. అదే 54 లక్షలు ఖర్చు చేసే నిబంధన ఉన్న ప్రాంతాల్లో 75 లక్షలను ఖర్చుచేసుకోవచ్చు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల్లో 28 లక్షల ఖర్చు చేయాలన్న నిబంధన ఉన్నవారు తాజా నిబంధనల ప్రకారం 40 లక్షలు ఖర్చు చేసుకోవచ్చు. అదే 20 లక్షలు ఖర్చు చేయాలన్న నిబంధన ఉన్న వారు తాజా నిబంధనల ప్రకారం 28 లక్షలు ఖర్చు చేసుకోవచ్చు.
The Election Commission of India enhances the existing election expenditure limit for candidates in Parliamentary and Assembly constituencies. These limits will be applicable in all upcoming elections. pic.twitter.com/TGbTaJBs7N
— ANI (@ANI) January 6, 2022
మరికొన్ని నెలల్లో ఉత్తరప్రదేశ్(Uttar pradesh), పంజాబ్(Punjab), ఉత్తరాఖండ్(Uttarakhand), గోవా(Goa), మణిపూర్(manipur) ల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. నోటిఫికేషన్ పై ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పర్యటించింది. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శితో సమావేశమై కోవిడ్ ప్రభావంపై చర్చించింది. తాజాగా ఎన్నికల ఖర్చును కూడా పెంచడంతో త్వరలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.