Representative Image (File Image)

వివాహేతర బంధంలో కుటుంబ విలువలు పతనం అయిపోతున్నాయి. కట్టుకున్న భర్తను ఓ మహిళ తన ప్రియుడితో కలిసి  హత్య చేసి అతడి శవం కూడా దొరక్కుండా ఏడాదిన్నర పాటు దాచిపెట్టి  చివరకు పోలీసులకు  దొరికిపోయింది.  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో చోటుచేసుకుంది. 2021 సంవత్సరం ఏప్రిల్ లో రేవా జిల్లాలోని మౌగంజ్ పోలీస్ స్టేషన్‌లోని ఉమ్రి గ్రామంలో రాం సుశీల్ పాల్ హత్యకు గురయ్యాడు. కాగా  అప్పటి నుంచి మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని  దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అతడి ఆచూకీ ఏమాత్రం దక్కలేదు.  కాగా గత వారం అడవిలో అస్తిపంజరం లభించగా దాన్ని పరీక్ష చేసి రాం సుశీల్  శవంగా గుర్తించారు.  దర్యాప్తులో  ఈ కేసు గురించి వాస్తవాలు బయటకు రాగానే  పోలీస్ షాక్ అవుతున్నారు.  కట్టుకున్న భార్య అలాగే ఆమె ప్రియుడు మరో ఇద్దరు కలిసి రామ్ సుశీల్ ను హత్య చేసినట్లు గుర్తించారు. 

పూర్తి వివరాల్లోకి వెళితే ఉమ్రి గ్రామానికి  చెందిన 40 ఏళ్ల రాంసుశీల్ పాల్ మొదటి భార్య చనిపోయింది. ఆ తర్వాత అతను రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య పేరు బిటోల్ అలియాస్ రంజన పాల్. పెళ్లయిన రెండేళ్ల తర్వాత తన బావ గులాబ్ పాల్ తో రంజనా ప్రేమాయణం ప్రారంభించింది.  వివాహేతరబంధంగా మారింది. వీరి వివాహ బంధానికి రామ్ సుశీల్ అడ్డుగా నిలిచాడని గుర్తించిన  నిందితురాలు రంజనా  తన ప్రియుడు  గులాబ్ తో కలిసి  అతి దారుణంగా భర్తను హత్య చేసింది. అనంతరం గ్రామస్తులకు అనుమానం రాకుండా భర్త శవాన్ని ముక్కలుగా చేసి గోనె సంచిలో  నింపి ఇంటి వెనుకే ఏడాదిన్నరగా గడ్డి వాములో దాచి ఉంచింది. మరోవైపు పోలీసులకు  తన భర్త కనిపించడం లేదని మిస్సింగ్ కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా రాం సుశీల్ ఆచూకీ ఎంతకీ లభించలేదు. 

 అలా ఏడాదిన్నర కాలం గడిచిపోయింది. అయితే నిందితులు చేసిన ఒక తప్పు  పోలీసులకు దొరికి పోయేలా చేసింది.  గడ్డివాములో దాచిన శవం పూర్తిగా పూర్తిగా కుళ్లిపోయి  అస్తిపంజరం గా మారిపోయింది. కాగా  ఆ మూటను సమీపంలో అడవిలో అంటుకున్న కార్చిచ్చు లో పడేస్తే ఇక సాక్షాలు దొరకవని నిందితులు భావించారు. అనుకున్నట్లుగా అస్తిపంజరం కార్చిచ్చులో కాలలేద.  కానీ అస్తిపంజరం మూటను చూసి  కొందరు గ్రామస్తులు మానవ శవంగా భావించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్లూస్ టీం తో ఆ అస్తిపంజరం ఎముకలను సేకరించి  దర్యాప్తు చేయగా ఆ శవం  ఏడాదిన్నర క్రితం మరణించిన వ్యక్తివిగా నిర్దారణకు వచ్చి. ఆ సమయంలో నమోదైన మిస్సింగ్ కేసులను తిరగదోడారు. అప్పుడే ఆ అస్తిపంజరం రాం సుశీల్ దిగా భావించి కేసు దర్యాప్తు వేగం పెంచగా, నిందుతులు శవాన్ని గడ్డివాములోనే ఏడాదిన్నరపాటు ఉంచినట్లే తేలింది.  

రేవా SSP నవనీత్ భాసిన్ మాట్లాడుతూ, పోలీసులు మౌగంజ్ పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 302, 201 నేరాన్ని నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని చెప్పారు. నిందితుడైన భార్య తన బావతో కలిసి భర్తను హత్య చేసింది. అడవిలో అగ్ని విసిరి పారిపోయారు. ఇద్దరు నిందితుల కోసం గాలిస్తుండగా నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.