Salman Khan Threat Letter: పంజాబ్‌ సింగర్‌ సిద్ధూ మూసేవాలా లాగా సల్మాన్‌ ఖాన్ ను చంపేస్తాం అంటూ బెదిరింపు లేఖ, పోలీసులకు ఫిర్యాదు చేసిన సల్మాన్...
Salman Khan in Self-Isolation (Photo Credits: Instagram)

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. సల్మాన్ ఖాన్, అతని తండ్రి సలీంఖాన్‌ను చంపేస్తామంటూ అగంతకుడు లేఖ రాశాడు. పంజాబ్‌ సింగర్‌ సిద్ధూ మూసేవాలా లాగే సల్మాన్‌ను చంపేస్తామని ఈ లేఖలో బెదిరించారు. దీంతో సల్మాన్ ఖాన్ బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు లేఖ ఎవరు రాశారన్న విషయంపై ఆరా తీస్తున్నారు.

సల్మాన్‌ఖాన్‌ తండ్రి సలీంఖాన్‌ ఉదయం జాగింగ్‌కు వెళ్లినప్పుడు అక్కడ బెంచ్‌పై కూర్చున్నప్పుడు అతడిని, అతని కొడుకు సల్మాన్‌ఖాన్‌ని బెదిరిస్తూ ఈ లేఖ కనిపించింది. పంజాబీ సింగర్‌ సిద్ధూ మూస్ వాలా లాగే సల్మాన్‌ను కూడా హతమారుస్తామని అగంతకులు లేఖలో బెదిరించారు. ఉదయం 7:30 నుంచి 8:00 గంటల సమయంలో సలీంఖాన్‌కు లేఖ అందింది. సమాచారం అందుకున్న బాంద్రా పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.