Satna, OCT 04: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం రాత్రి మూడంతస్తుల భవనం (3 Storey Building) కుప్పకూలింది. సత్నా పట్టణంలో మూడంతస్తుల భవనం కుప్పకూలిన (Building Collapses) ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందాడు. ఎస్‌డిఆర్‌ఎఫ్, పోలీసులు శిథిలాల తొలగింపు పనులు చేపట్టారు. భవన శిథిలాల్లో చిక్కుకున్న మరో ఇద్దరిని సహాయ సిబ్బంది రక్షించారు. మంగళవార్‌లోని బీహార్ చౌక్ సమీపంలో రాత్రి 10.30 గంటలకు ఈ సంఘటన జరిగింది. గత 10 రోజులుగా భవనం వద్ద నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
2 labourers rescued after a three-storey building collapsed in Madhya Pradesh's Satna: Abhishek Gehlot, Commissioner, Municipal Corporation, Satna
— ANI (@ANI) October 4, 2023
సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు,పరిపాలనా అధికారులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందంతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. గాయపడిన కూలీలను ఆసుపత్రికి తరలించారు. భవనం కూలిపోవడానికి కారణాలు తెలియలేదు.