Karachi,November 22: దాయాది దేశం పాకిస్థాన్(Pakistan)లో టమాట ధరలు (Tomato Price In Pak) ఆకాశాన్నంటుతున్నాయి. ఎన్నడూలేని విధంగా ధరలు భగ్గుమంటున్నాయి. ప్రధానంగా కరాచీ (Karachi) నగరంలో బుధవారం కిలో టమాట ధర రూ.400 పలికింది. కొన్ని ప్రధాన మార్కెట్లలో కిలో దాదాపు రూ. 350 నుంచి రూ. 380 మధ్యలో పలికింది.
ఇటీవల ఇరాన్ (Iran)నుంచి 4,500 టన్నుల టమాటాల దిగుమతికి పాక్ ప్రభుత్వం అనుమతించినప్పటికీ అందులో కేవలం 989 టన్నులు మాత్రమే మార్కెట్‌కు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో డిమాండ్‌కు తగ్గట్టు సరుకు అందుబాటులో లేకపోవడంతో ధరలు పెరిగిపోతున్నాయి.
కాగా నవంబర్ మొదటి వారంలో టమోటా కిలో ధర రూ. 250 వరకు ఉంది .అయితే అది ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇండియా పాకిస్తాన్ కు టమోటాల ఎగుమతిని బ్యాన్ చేసిన నేపథ్యంలో అక్కడ భారీ పెరుగుదల చోటు చేసుకుంది. దీంతో అక్కడి ప్రజలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
అక్కడి ప్రజలు వంద రూపాయలు మార్కెట్లోకి తీసుకుని వెళితే కేవలం నాలుగు టమోటాలు మాత్రమే వస్తున్నాయని వాపోతున్నారు. ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. ఈ మధ్య పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ (Pakistan Economy) భారీగా కుదలైన సంగతి తెలిసిందే.