Credits: Twitter

Srinagar, NOV 09: జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌లో (Shopian) భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు (Encounter) జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ ముష్కరుడు (Terrorist) హతమయ్యాడు. గురువారం తెల్లవారుజామున షోపియాన్‌లోని కతోహలెన్‌ ప్రాంతంలో (Kathohalen area) ఎన్‌కౌంటర్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఓ టెర్రరిస్టును మట్టుబెట్టామని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు.  అతడిని ద రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (TRF) ఉగ్రసంస్థకు చెందిన ఉగ్రవాదిగా గుర్తించామని వెల్లడించారు.

 

ఘటనా స్థలంలో ఆయుధాలు, యుద్ధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మరో ఘటనలో రామ్‌గఢ్‌ సెక్టార్‌లోని (Ramgarh sector) అంతర్జాతీయ సరిహద్దుల వద్ద జరిగిన కాల్పుల్లో ఓ జవాన్‌ గాయపడ్డారు.

 

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్థాన్‌ (Pakistan) సైన్యం కాల్పులకు తెగబడింది. దీంతో సరిహద్దు భద్రతా దళానికి (BSF) చెందిన ఓ జవాన్‌ తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.