రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌ టైలర్‌ హత్య కేసు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలో.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం ఉదయం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనలో ఉగ్రకోణం అనుమానాలు వ్యక్తం అవుతున్నందున.. జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) విచారణకు ఆదేశించింది. కస్టమర్లలాగా నటిస్తూ కొలతలు ఇస్తుండగానే.. కన్హయ్య గొంతు కోసి హత్య చేస్తూ వీడియో వైరల్‌ చేయడం, ఆపై ప్రధానికి సైతం హెచ్చరికలు జారీ చేసిన వీడియోలు వైరల్‌ కావడం తెలిసిందే.

ప్రవక్తపై కామెంట్ల వివాదం తర్వాత.. నూపుర్‌కు మద్ధతుగా కన్హయ్య పోస్టులు పెట్టినందుకే ఈ హత్య జరిగనట్లు నిందితుల వీడియో ద్వారా స్పష్టమైంది. మరోవైపు .. సదరు వీడియోలను తొలగించాలంటూ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు ఆదేశాలు జారీ అయ్యాయి. మరో వైపు ఉగ్ర కోణం నేపథ్యంలోనే కేంద్ర హోం శాఖ ఎన్‌ఐఏ దర్యాప్తునకు ఆదేశించినట్లు స్పష్టం అవుతోంది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ ట్విటర్‌లో ప్రకటించింది కూడా.

ఏదైనా సంస్థ ప్రమేయం, అంతర్జాతీయ లింకులు క్షుణ్ణంగా పరిశోధించబడతాయి అని ట్వీట్‌లో పేర్కొంది. ఇక ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే డిప్యూటీ ఐజీ స్థాయి అధికారితో పాటు ఎన్‌ఐఏ బృందం ఒకటి మంగళవారమే ఉదయ్‌పూర్‌కు చేరుకుని పరిశీలించింది. తాజా సమాచారం ప్రకారం.. చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఉదయ్‌పూర్‌ ఘటనపై ఎన్‌ఐఏ బృందం కేసు నమోదు చేయొచ్చని తెలుస్తోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)