Parliament of India | File Photo

New Delhi, January 9: త్వరలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Budget session of Parliament) ప్రారంభం కానున్నాయి. ఈసారి రెండు విడతల్లో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. తొలి విడత బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరుగుతాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) పార్లమెంటులో 2020-యూనియన్ బడ్జెట్  (Budget 2020) ప్రవేశపెట్టనున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. రెండవ దశ బడ్జెట్ సెషన్ మార్చి 2 నుండి ఏప్రిల్ 3 వరకు జరగనుంది.

పార్లమెంటు ఉభయసభల్లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రారంభ ప్రసంగం తర్వాత బడ్జెట్ సెషన్ ప్రారంభమవుతుంది. అదే రోజున ఆర్థిక సర్వేను సమర్పించే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర మంత్రివర్గం చేసిన సిఫారసులపై రాష్ట్రపతి ఉభయ సభలకు సమాచారం అదించారు.

Here's the update:

బడ్జెట్ సెషన్ ప్రారంభానికి ముందు రోజు, ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని అగ్రశ్రేణి ఆర్థికవేత్తలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశం నీతి ఆయోగ్‌లో జరుగుతుందని సమాచారం.

పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సిసిపిఎ) బడ్జెట్ సెషన్ తేదీలకు ఆమోదం తెలిపిన తరువాత తుది తేదీలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది.