Surat, July 14: ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూపును (Rare Blood Group) భారత్‌లో పరిశోధకులు గుర్తించారు. గుజరాత్‌కు చెందిన 65 ఏళ్ల వ్యక్తికి EMM నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నట్లు గుర్తించారు. ఇటువంటి అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ ప్రపంచంలో కేవలం 10మందికి మాత్రమే ఉంది. అటువంటి రక్తపు గ్రూపును(Blood Group) కలిగిన పదవ వ్యక్తిగా 65 ఏళ్ల గుజరాత్ వ్యక్తి రికార్డ్ సృష్టించాడు. అసలు ఆ బ్లడ్ గ్రూప్ ప్రత్యేకత ఏంటి..? అది ఎలా పనిచేస్తోందో తెలుసుకుందాం. సాధారణంగా ఏ, బీ, ఓ, ఏబీ ఇలా బ్లడ్ గ్రూపులు ఉంటాయని అందరికీ తెలిసిందే. వీటిలోనే ఈఎంఎం నెగిటివ్ ఎంతో ప్రత్యేకమైనది. మానవ శరీరంలో నాలుగు రకాల రక్త సమూహాలలో ఏ, బీ, ఓ, ఆర్ హెచ్ వంటి 42 రకాల వ్యవస్థలు ఉంటాయి. కానీ, ఈఎంఎంలో 375 రకాల యాంటిజెన్లు (Antigines) ఉంటాయి.

ఇలాంటి బ్లడ్ గ్రూపు కలిగిన వ్యక్తులు ఇతరులకు రక్తం దానం చేయడం కానీ..ఇతరుల నుంచి రక్తం స్వీకరించే అవకాశం ఉండదని నిపుణులు తెలిపారు.అయితే..గుజరాత్‌కు చెందిన ఈ వ్యక్తికి గుండె సమస్య(Heart problem). దీనికి సంబంధించిన సర్జరీ కోసం చేసిన రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ సమయంలోనే ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ బయట పడిందని డాక్టర్లు తెలిపారు. దీనికి ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ ఫ్యూజన్ EMM నెగిటివ్ అని నామకరణం చేసింది.

Unnao Shocker: షాకింగ్ వీడియో.. 30 సెకన్లలో 10 చెంప దెబ్బలు, ఐదేళ్ల చిన్నారిపై ఓ టీచర్ పైశాచికం, చిన్నారి బోరున ఏడుస్తున్నా జుట్టు పట్టుకుని వాయించిన ఉపాధ్యాయురాలు 

అయితే గుజరాత్‌కు చెందిన ఈ 65 ఏళ్ల వ్యక్తికి గుండె సమస్య ఉంది. అతను సూరత్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది. సూరత్‌లోని సమర్పన్ బ్లడ్ డొనేషన్ (Blood donation)సెంటర్ వైద్యుడు సన్ముఖ్ జోషి తెలిపారు. దీని కోసం డాక్టర్లు రక్త పరీక్షలు చేయగా ఈ అరుదైన బ్లడ్ గ్రూప్ ఉన్నట్లుగా బయట పడిందని వైద్యులు తెలిపారు. దీనికి ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ ఫ్యూజన్ EMM నెగిటివ్ అని నామకరణం చేసింది.

Free COVID Booster Dose: ఈనెల 15 నుంచి ఉచితంగా బూస్టర్ డోస్‌లు, 18 ఏళ్లు పైబడిన వారందరికీ 75 రోజుల పాటు ఫ్రీగా ఇవ్వనున్నట్లు తెలిపిన కేంద్రం  

అయితే..అహ్మదాబాద్‌లోని ప్రథమ ల్యాబొరేటరీలో అతని రక్తం రకం కనుగొనబడకపోవడంతో, నమూనాలను సూరత్‌లోని రక్తదాన కేంద్రానికి పంపారు.పరీక్ష తర్వాత, నమూనా ఏ సమూహంతోనూ సరిపోలలేదు. దీని తరువాత వృద్ధుడితో పాటు అతని బంధువుల రక్త నమూనాలను దర్యాప్తు కోసం అమెరికాకు పంపారు. ఆ తర్వాత ఇది EMM Blood Group అని తేలింది.