Mainpuri, SEP 04: గణేశ్ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. మండపంలో నిర్వహించిన భజనలో హనుమంతుడు వేషం (playing role of Hanuman) వేసిన కళాకారుడు డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో అక్కడికక్కడే చనిపోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి (Mainpuri) జిల్లాలో ఈ ఘటన జరిగింది. కొత్వాలి ప్రాంతంలోని శివాలయంలో వినాయక చవితి  (Ganesh pandal)వేడుకల్లో భాగంగా శనివారం రాత్రి భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భజన బృందానికి చెందిన రవి శర్మ (Ravi sharma) అనే కళాకారుడు ఆంజనేయుడి వేషంలో డ్యాన్స్ చేస్తూ అందరినీ అలరించాడు. భజనకు అనుగుణంగా డ్యాన్స్‌ చేశాడు. కొంతసేపటి తర్వాత మండపంపైనే అతడు అకస్మాత్తుగా బోర్లా పడిపోయాడు. ఇదంతా డ్యాన్స్‌లో భాగమే అని అంతా అనుకున్నారు. రవి శర్మ పైకి లేవడానికి కాసేపు ప్రయత్నించాడు. కానీ లేకలేకపోయాడు.

హనుమంతుడు వేషం వేసిన రవి శర్మ చాలా సేపటి వరకు పైకి లేవలేదు. ఇది గమనించిన మండపం నిర్వాహకులు అతడిని లేపే ప్రయత్నం చేశారు. కానీ అతడిలో చలనం లేదు. దీంతో వెంటనే అతడిని మెయిన్‌పురి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతడు మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించడంతో వారు షాక్ తిన్నారు. డ్యాన్స్ చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో రవి శర్మ చనిపోయాడని డాక్టర్లు వెల్లడించారు.

Puducherry Shocker: తన కొడుకు కంటే బాగా చదువుతున్నాడని చంపాలని చూసింది, కొడుకు స్నేహితుడికి కూల్‌డ్రింక్‌లో విషమిచ్చిన మహిళ, పుదుచ్చేరిలో దారుణం, తన కొడుకే క్లాస్ ఫస్ట్ రావాలని ప్లాన్ వేసిన మహిళ 

రవి శర్మ డ్యాన్స్ చేస్తూ స్టేజిపైనే కుప్పకూలాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రవి శర్మ వయసు 35ఏళ్లు. అతడు ఓ కళాకారుడు. రవి శర్మ ఆకస్మిక మరణంతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది. అతడి కుటుంబంలో రోదనలు మిన్నంటాయి.