Lucknow, March 03: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఆరో దశ (6th Phase election) ఎన్నికలు కొనసాగుతున్నాయి.ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నియోజకవర్గం గోరఖ్‌పూర్‌తో (Gorakhpur) సహా 10 జిల్లాల్లో 57 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతోంది. ఆరో దశ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమవ్వగా సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ దశలో రెండు కోట్ల 14 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 57 సీట్లలో 46 బీజేపీ, రెండు దాని మిత్రపక్షాలు అప్నా దళ్ (S), సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SubhSP) గెలుచుకున్నాయి. అయితే ఈసారి ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుని సుభాఎస్పీ పోటీ చేస్తోంది. ఆరో దశ పది జిల్లాల్లో అంబేద్కర్ నగర్, బలరాంపూర్, సిద్ధార్థనగర్, బస్తీ, సంత్ కబీర్ నగర్, మహరాజ్‌గంజ్, గోరఖ్‌పూర్, ఖుషీనగర్, డియోరియా, బల్లియా జిల్లాల్లోని 57 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఆరో దశలో భాగంగా ఉదయం 9 గంటల వరకు 8.69 శాతం పోలింగ్ నమోదైంది.
8.69% voter turnout recorded till 9 am in the sixth phase of #UttarPradeshAssembly elections
Voting is underway in 57 Assembly seats across 10 districts pic.twitter.com/HPAA2WUSB9
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 3, 2022
ఆరో దశలో 57 సీట్లలో 11 సీట్లు షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడ్డాయి. ఈ దశలో మొత్తం 2.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలోని 403 అసెంబ్లీ స్థానాల్లో ప్రతిపాదిత ఏడు దశల అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు దశల్లో 292 స్థానాల్లో ఓటింగ్ నిర్వహించగా, చివరి రెండు దశల్లో వరుసగా మార్చి 3, మార్చి 7 తేదీల్లో 111 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.
గోరఖ్‌పూర్ నుంచి బరిలో ఉన్న సీఎం యోగి ఆదిత్యానాథ్(CM Adityanath)...ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు ఎన్నికల ముందు బీజేపీ నుంచి ఎస్పీలోకి జంప్ అయిన మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య(Swami prasad mourya) కూడా ఫాజిల్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో ఉన్నారు. ఆయన కూడా ఈ దశలోనే అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.