Sammanpur, FEB 10: విద్యార్థులు శుభ్రంగా ఆరోగ్యంగా ఉండాలని తరుచూ చెప్తుంటారు. ఇలా ఉండడం వల్ల చదువు మీద శ్రద్ధ కూడా పెరుగుతుందని చెప్తుంటారు. టీచర్లు కూడా విద్యార్థులకు ఇదే చెప్తుంటారు. కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక టీచర్ దీనికి భిన్నంగా వ్యవహరించాడు. క్రాప్ హెయిర్ స్టైల్‭తో వస్తున్నాడని విద్యార్థికి గుండు (Shaved head) కొట్టించాడు. రాష్ట్రంలోని అంబేద్కర్ నగర్ జిల్లాలోని సమ్మాన్‭పూర్ (Sammanpur) పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన ఇది. విద్యార్థి తండ్రి ఫిర్యాదుతో సదరు టీచర్‭ను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.. సమ్మాన్‌పూర్‌ ప్రాంతంలోని కుర్కి బజార్ పాఠశాలలో చదువుతున్న ఒక విద్యార్థి క్రాప్ హెయిర్ (Hair style) స్టైల్‭తో పాఠశాలకు వస్తున్నాడు. అయితే ఇది నచ్చని ఆ పాఠశాల స్టాఫ్ మెంబర్ ఒకరు ఆ విద్యార్థికి గుండు కొట్టించాడు.

Uttar Pradesh Horror: ఏడాది చిన్నారిపై మంత్రగాడు దారుణం, కుద్ర పూజలు పేరిట పళ్లు విరగొట్టి, నేలకేసి కొట్టిన భూత వైద్యుడు, చోద్యం చూస్తూ నిలబడ్డ తండ్రి 

విద్యార్థి సాయంత్రం అదే గుండుతో ఇంటికి వెళ్లాడు. తల్లిదండ్రులు చూస్తారనే భయంతో ఆ గుండును దాచే ప్రయత్నం చేసినప్పటికీ దొరికిపోయాడు. విషయం ఏంటని ఆరా తీస్తే పాఠశాలలో జరిగింది చెప్పాడు. కొడుకు చెప్పిన విషయం విన్న తండ్రి వెంటనే పోలీస్ స్టేషన్ వెళ్లి సదరు టీచర్ మీద ఫిర్యాదు చేశాడు.ఆ టీచర్‭ను అరెస్ట్ చేసిన పోలీసులు.. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 504, సెక్షన్ 506 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.