UP Shocker: మైనర్ బాలిక నోట్లో గుడ్డలు కుక్కి..5 మంది దారుణంగా అత్యాచారం, అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలిక, బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రాంపూర్ పోలీసులు
Image used for representational purpose only | (Photo Credits: ANI)

Rampur, August 24: యూపీలోని రాంపూర్‌లో దారుణం చోటు​ చేసుకుంది. ఓ 14 ఏళ్ల మైనర్‌ బాలికను కిడ్నాప్‌ చేసిన అయిదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి తెగపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. ‘‘ఆదివారం రాత్రి బాలికతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఇంటి వరండాలో నిద్రిస్తున్నారు. ఆ సమయంలో రాంపూర్‌లోని ఓ అయిదుగురు దుండగులు బాధితురాలి ఇంట్లోకి ప్రవేశించి ఆమె నోటిలో గుడ్డలు కుక్కి కిడ్నాప్‌ (Minor girl abducted from home) చేశారు.

నిందితులలో ఒకరికి చెందిన దుకాణానికి తీసుకెళ్లి అక్కడ అత్యాచారం (gang-raped by five in Uttar Pradesh's Rampur) చేశారు. ఆ తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను తన ఇంటి సమీపంలో వదిలి వెళ్లారు. కాగా స్పృహలోకి వచ్చిన తర్వాత బాలిక కుంటుంబ సభ్యులకు జరిగిన ఘోరాన్ని తెలిపింది.’’ అని అన్నారు.ఇక ఈ ఘటనపై బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మొత్తం ఐదుగురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులలో ఒకరితో బాలికకు స్నేహం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలినట్టు వెల్లడించారు.

భర్త తాగుబోతు, వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య, హెచ్చరించడంతో భర్తను కిరాతకంగా హత్య చేసిన భార్య, వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన

అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు రాంపూర్ ఎస్పీ అంకిత్ కుమార్ తెలిపారు. అయితే ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారణ కాలేదని అన్నారు. అయితే కేసు తీవ్రత, చేస్తున్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని, సమగ్ర దర్యాప్తు జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. మేజిస్ట్రేట్ ముందు బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని ఆయన చెప్పారు.