Kanpur, Dec 24: యూపీలో కాన్పూర్‌లో పన్ను ఎగవేత ఆరోపణలపై సుగంధ ద్రవ్యాల వ్యాపారి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీలు చేస్తుండగా సంచుల కొద్ది నోట్ల కట్టలు గుట్లల్లా కనిపించడంతో అధికారులు షాకయ్యారు. జీఎస్‌టీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ జనరల్ బృందం గురువారం ఉదయం పెర్ఫ్యూమ్ వ్యాపారి పియూష్ జైన్ ఇల్లు, ఫ్యాక్టరీ, కార్యాలయం, కోల్డ్ స్టోరేజీ, పెట్రోల్ బంకులపై ఏక కాలంలొ దాడులు (Income Tax officials Raid) నిర్వహించారు.
కాన్పూర్, కన్నౌజ్, గుజరాత్, ముంబైలో ఉన్న సంస్థలలో ఈ దాడులు జరిగాయి. వ్యాపారి ఇంట్లో తనిఖీలు చేస్తుండగా భారీగా నగదు పట్టుబడింది. బ్యాంక్ అధికారులు దీనిని లెక్కించగా 150 కోట్ల రూపాయల పన్ను ఎగవేతలకు (₹150 cr from businessman) సంబంధించి ఆధారాలు లభించినట్లు తెలిసింది. పీయూష్ జైన్ ఎస్పీ నేతకు సన్నిహితుడు కూడా. కొన్ని రోజుల క్రితమే సమాజ్ వాదీ పేరుతో పెర్ఫ్యూమ్‌ను (Samajwadi Party's perfume) విడుదల చేసిన సంగతి విదితమే.
Here's Update
समाजवादियों का नारा है
जनता का पैसा हमारा है!
समाजवादी पार्टी के कार्यालय में समाजवादी इत्र लॉन्च करने वाले पीयूष जैन के यहाँ GST के छापे में बरामद 100+ करोड़ कौन से समाजवाद की काली कमाई है? pic.twitter.com/EEp7H5IHmt
— Sambit Patra (@sambitswaraj) December 24, 2021
ఈ సంస్థకు ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. కన్నౌజ్‌లో ఉన్న ఫ్యాక్టరీ నుంచి పెర్ఫ్యూమ్ ముంబైకి వెళ్తుందని అక్కడి నుంచి పెర్ఫ్యూమ్ దేశ విదేశాల్లో కూడా అమ్ముడవుతోందని తెలిపారు. సౌదీ అరేబియాలో రెండు, దేశంలోని తూర్పు రాష్ట్రాల్లో రెండు సహా పీయూష్ జైన్‌కు దాదాపు 40 కంపెనీలు ఉన్నాయని తెలిపారు.