Ayodhya, Oct 30: దీపావళికు ముందు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామాలయం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. దీపోత్సవ వేడుకల్లో భాగంగా ఇవాళ (బుధవారం) ఏకంగా 25 లక్షల మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించారు. గిన్నీస్ రికార్డు సృష్టించాలనే లక్ష్యంతో ఇంత పెద్ద సంఖ్యలో దీపాలను వెలిగించారు.
దీపోత్సవం వేడుకలతో పవిత్ర అయోధ్య నగరం ఆధ్యాత్మిక, సాంప్రదాయ, సాంస్కృతిక శోభను సంతరించుకుంది. మయన్మార్, నేపాల్, థాయ్‌లాండ్, మలేషియా, కాంబోడియా, ఇండోనేషియా దేశాలకు చెందిన కళాకారులు పలు ఆకట్టుకునే ప్రదర్శనలు చేశారు. రామ్ లీలా ప్రదర్శనతో పాటు పలు ప్రదర్శనలు నిర్వహించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
అయోధ్యలో అంబరాన్ని అంటిన దీపావళి వేడుక సంబరాలు, సరయూ ఘాట్ వద్ద లేజర్, లైట్ షో వీడియోలు ఇవిగో..
కాగా ఇవాళ (బుధవారం) తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దీపోత్సవ హారతిని స్వీకరించారు. కళాకారులు ప్రదర్శించిన రథాన్ని కూడా ఆయన లాగారు. కాగా అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ తర్వాత ఇదే తొలి దీపోత్సవం కావడంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
Ayodhya Deepotsav 2024
#WATCH | Uttar Pradesh: Lakhs of diyas illuminated along the banks of the Saryu River in Ayodhya as part of the grand #Deepotsav celebration here. #Diwali2024 pic.twitter.com/P29BPld9KO
— ANI (@ANI) October 30, 2024
#WATCH | 'Aarti' being performed by Uttar Pradesh CM Yogi Adityanath, Union Minister Gajendra Singh Shekhawat, Deputy CM Brajesh Pathak and others on the banks of Saryu River in Ayodhya
#Diwali2024 #Deepotsav pic.twitter.com/FMXzUzokbD
— ANI (@ANI) October 30, 2024
#WATCH | Uttar Pradesh: Saryu ghat illuminated with lakhs of diyas in Ayodhya as part of grand #Deepotsav celebration here.#Diwali2024 pic.twitter.com/DkbWnPmPzR
— ANI (@ANI) October 30, 2024
ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని సరయూ ఘాట్ వద్ద లేజర్ మరియు లైట్ షో జరుగుతోంది. ఘాట్ దీపాలు మరియు రంగురంగుల లైట్లతో, రామ్ లీలా గురించి సౌండ్-లైట్ షో ద్వారా వివరించబడుతోంది. డ్రోన్ షో ఆద్యంతం ఆకట్టుకుంటోంది.