Uttara Pradesh: కొన్ని విషయాలు వింటే ఇది నిజమా? సినిమానా? అనిపిస్తుంది. కేవలం సినిమాల్లో జరిగే కొన్ని విషయాలు మన చుట్టూ కూడా జరుగుతుంటాయి. పెళ్లైన 6 నెలలకే తన భార్యకు మరో పెళ్లి చేశారు
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి. పెళ్లైనప్పటి నుంచి తన భార్య సరిగ్గా మాట్లాడకపోవడం, కలిసి ఉండకపోవడంతో ఆరా తీసిన ఆ వ్యక్తి, భార్య మనసులో మరో వ్యక్తి ఉన్నాడని తెలుసుకున్నాడు. ఆమె ఇష్టపడ్డ వ్యక్తికే ఇచ్చి ఘనంగా పెళ్లి చేశాడు.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కి చెందిన పంకజ్ అనే వ్యక్తి తన భార్యకు ఆమె ప్రియుడిని ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ మొత్తం స్టోరీ చూస్తుంటే 1999లో వచ్చిన బ్లాక్‌బస్టర్ 'హమ్ దిల్ దే చుకే సనమ్' సినిమాను తలపిస్తోంది.
గుర్‌గ్రామ్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న పంకజ్ అనే వ్యక్తికి ఈ ఏడాది మేలో కోమల్ అనే యువతితో వివాహం అయ్యింది. అయితే పంకజ్ భార్య కోమల్ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అతనితో మాట్లాడకుండా దూరంగానే ఉండేది. తనతోనే కాదు ఇంట్లో వాళ్ల ఎవరితోనూ మాట్లాడటం లేదు. దీంతో భార్య అలా ప్రవర్తించడానికి గల కారణాలను ఆరా తీశాడు పంకజ్. చివరికి ఆమె పింటూ అనే వ్యక్తిని ప్రేమించినట్లు చెప్పింది. దీంతో పంకజ్ తన అత్తమామలకు ఈ విషయాన్ని చెప్పాడు. అయితే పంకజ్ అత్తమామలు కోమల్‌కు సర్ది చెప్పడానికి ప్రయత్నించిన ఆమె అంగీకరించ లేదు. దీంతో ఆమెకు కౌన్సిలింగ్ ఇప్పించాడు. అక్కడ కూడా ఆమె మనసు మారకపోవడంతో పెద్ద నిర్ణయం తీసుకున్నాడు.
కోమల పింటూనే వివాహం చేసుకోవాలని గట్టిగా నిశ్చయించుకోవడంతో చివరికి పంకజ్ వారి వివాహానికి అంగీకరించాడు. ఈ మేరకు పంకజ్ దగ్గరుండి మరీ లాయర్ సమక్షంలో తన భార్య ప్రేమించిన పింటూతో ఘనంగా వివాహం జరింపించాడు.
తెలుగులో వచ్చిన కన్యాదానం సినిమాను తలపించే ఈ స్టోరీ పంకజ్ నిర్ణయంతో సుఖాంతమయింది.