Mamatha benarji

Kolkata, AUG 15: కోతమ పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసిన అంశాలకు సంబంధించి అన్ని పత్రాలను సీబీఐకి (CBI) అప్పగించామని వెల్లడించారు. ఎలాంటి సమాచారం, ఆధారాలను బహిర్గతం చేయలేదని చెప్పారు. బాధితురాలి కుటుంబానికి తనతో పాటు, బెంగాల్‌ ప్రజల సానుభూతి ఉందని అన్నారు. ఇది చాలా పెద్ద నేరం, నిందితుడిని ఉరితీయడమే సరైన శిక్ష అని స్పష్టం చేశారు. దోషిని ఉరితీస్తేనే దాన్నుంచి ప్రజలు గుణపాఠం నేర్చుకుంటారని చెప్పారు. అయితే ఏ ఒక్క అమాయకుడినీ శిక్షించరాదని మమతా బెనర్జీ పేర్కొన్నారు.

Here's News

ఇక కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచార ఘటనను దేశవ్యాప్తంగా పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలు, ప్రజా సంఘాలు సహా అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ ఘటనలో సత్వర విచారణ చేపట్టి నేరస్తుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. దర్యాప్తులో జాప్యం జరగకుండా బాధిత కుటుంబానికి సత్వర న్యాయం జరిగేలా వ్యవహరించాలని కోరుతున్నారు.