Madurai, May 11:  తమిళనాడులోని మధురైలో (Madurai)మందుబాబులు పండుగ చేసుకున్నారు. మద్యం లోడుతో (liquor Load) వెళ్తున్న వ్యాన్ బోల్తా పడటంతో...చేతికందిన బాటిల్స్ తీసుకొని వెళ్లిపోయారు. కేరళలోని మానలూర్ (Manulur) నుంచి పది లక్షల రూపాయల విలువైన మద్యం బాటిళ్లతో ఒక ట్రాలీ వాహనం బుధవారం బయలుదేరింది.   అయితే, తమిళనాడులోని విరగనూర్ దగ్గర, మధురై హైవేపై వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో మద్యం బాటిళ్లు మొత్తం రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని, చేతికందిన మద్యం బాటిళ్లను తీసుకుని వెళ్లిపోయారు(liquor Loot). ప్రమాదం జరిగిన స్థలం జాతీయ రహదారి కావడంతో, చాలాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. స్పీడ్‌ గా వెళ్తూ వ్యాన్ బోల్తా కొట్టడంతో చాలావరకు బాటిల్స్ పగిలిపోయాయి. అయినప్పటికీ వాటిని కూడా వదలకుండా తీసుకెళ్లారు కొందరు వ్యక్తులు.

Tamil Nadu: తమిళనాడులో దారుణం, కులం పేరుతో విద్యార్థిని దూషించి మంటల్లోకి తోసేసిన మరికొందరు విద్యార్థులు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత విద్యార్థి 

అయితే, ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, అందరినీ చెదరగొట్టారు. మిగిలిన మద్యం సీసాలను సీజ్ చేశారు. గత నెల 20న కూడా మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. బీరు బాటిళ్లు ఉన్న కారు ప్రమాదానికి గురి అవ్వడంతో, స్థానికులు వాటిని ఎత్తుకెళ్లారు. ఘటన జరిగిన ప్రాంతంలోని వారికి ఈ వార్త క్షణాల్లో పాకిపోయింది. దీంతో మద్యం బాటిల్స్ కోసం ఎగబడ్డారు. కానీ అప్పటికే పోలీసులు చేరుకోవడంతో...మిస్సయ్యామని వెనుదిరిగారు.