Man Taking Samadhi (Photo-Video grab)

ఉ‍త్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తాజ్‌పూర్‌ గ్రామానికి చెందిన ముగ్గురు పూజారులు ( Local Sadhus in Unnao) మాయమాటలు నమ్మిన ఓ యువకుడు సజీవ సమాధికి (Man Duped Into Taking Samadhi) సిద్ధమయ్యాడు. తాజ్‌పూర్‌ గ్రామానికి చెందిన శుభమ్‌ గోస్వామీ అనే యువకుడు నవరాత్రుల సందర్భంగా ఆరడగుల గోతులో బతికి ఉండగానే సమాధి అయ్యేందుకు సిద్ధమయ్యాడు.

స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హూటాహుటీన ఘటన స్థలానికి చేరుకున్న ఉన్నావ్ పోలీసులు (Rescued on Time by Police) సదరు యువకుడిని ఆ సమాధి నుంచి కాపాడారు. ఆ యువకుడిని విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో ఆ యువకుడు..తాను ఊరుకి దూరంగా గుడిసె వేసుకుని అక్కడే ఐదారేళ్లుగా ఉంటున్నట్లు చెప్పాడు.

హెల్మెట్ లేకుండా ర్యాష్ డ్రైవింగ్ చేసినందుకు రూ. 4200 ఫైన్ వేసిన పోలీసులు, సోషల్ మీడియాలో వీడియో వైరల్

శివకేశవ్‌ దీక్షిత్‌, మున్నాలాల్‌ అనే పూజారులతో గత కొంతకాలంగా పరిచయం ఏర్పడినట్లు తెలిపాడు. సజీవ సమాధి అయితే జ్ఞానోదయం అవుతుందని, ఈ పనిని దేవీనవరాత్రులు ప్రారంభానికి ముందుగా చేస్తేనే సఫలం అవుతుందని చెప్పినట్లు వెల్లడించాడు. అందుకు తాను తన తండ్రి వినీత్‌ గోస్వామీ మరికొందరు సాయంతో భూమి లోపల ఆరుడుగుల గోతిలో సజీవ సమాధి అయ్యేందుకు సిద్ధమైనట్లు వివరించాడు.

Here's Video

ఐతే గ్రామంలో ఒక యువకుడు సజీవ సమాధి అయ్యాడంటూ వార్తలు గుప్పుమన్నాయని, దీంతో తాము చాలా భయందోళనలకు గురయ్యామని పోలీసులు తెలిపారు. నిందితులు మున్నాలాల్‌, శివ కేశవ్‌ దీక్షిత్‌ అనే ముగ్గురు పూజారులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఐతే ఆ నిందితులు బాధితుడి నమ్మకాన్ని సోమ్ము చేసుకోవాలనే దురుద్దేశంతో ఇలా భూసమాధి కావాలనే కుట్రను పన్నినట్లు పేర్కొన్నారు.