Pune, June 21: ఒక మహిళను బలవంతంగా కారులోకి లాగుతున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మహిళ కిడ్నాప్‌కు గురైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మహిళను లాగుతున్న వీడియోలోని వ్యక్తి ఆమె భర్త. ఈ సంఘటన కుటుంబ కలహాల నుండి వచ్చింది. ఫిజికల్ రిలేషన్స్‌కు సంబంధించిన వివాదం అని రిపోర్టులు చెబుతున్నాయి. అపహరణ అనంతరం ఆమెను కారులోనే నిర్బంధించి మత్తుమందులు ఇచ్చారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలికి, ఆమె భర్తకు 1.5 ఏళ్ల క్రితం వివాహమైంది. కేవలం 7-8 రోజుల తరువాత ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి. దీంతో విసిగిపోయిన బాధితురాలు పూణేలోని తన మామ వద్దకు వెళ్లింది. స్త్రీకి తల్లిదండ్రులు లేరు. ఆమె బంధువులు మధ్యవర్తిత్వం వహించారు, ఫలితంగా ఆమె తన భర్తతో నివసించడానికి తిరిగి వచ్చింది. అయినప్పటికీ గొడవలు సద్దుమణగలేదు. ఆమె మళ్లీ అతనిని విడిచిపెట్టింది. దారుణం, ఇంటర్యూ కోసం రూంలోకి రాగానే యువతిపై సామూహిక అత్యాచారం, 100 మందికి పైగా మహిళలపై గ్యాంగ్ రేప్‌కి పాల్పడిన కంపెనీ యాజమాన్యం
వెళ్లిన తర్వాత, ఆమె ముంబై, ఢిల్లీలో చాలా నెలలు గడిపింది. ఇంతలో భర్త ఆమెను సంప్రదించేందుకు ప్రయత్నించాడు. ఆమె చివరికి ఉద్యోగంతో వాకాడ్‌లో స్థిరపడింది. పేయింగ్ గెస్ట్ అకామోడేషన్ (పీజీ)లో నివసిస్తోంది. ఆమె ఎక్కడ నివాసం ఉందో తెలుసుకున్న భర్త, అతని కుటుంబ సభ్యులు వాకడ్‌కు వచ్చారు. ఇంటికి తిరిగి రావాలని వారు ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె నిరాకరించింది.
#Pune: Shocking Kidnapping Incident Unfolds in Wakad, Video Goes Viral
Read In Detail
Video 👇 👇 pic.twitter.com/fV5uJsRglR
— Punekar News (@punekarnews) June 21, 2024
ఆవేశంతో ఆమెను బలవంతంగా అపహరించేందుకు ప్రయత్నించారు.చివరకు స్థానిక యువకుల సహాయంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. వాకాడ్ పోలీస్ స్టేషన్ నుండి ఒక అధికారి పుణేకర్ న్యూస్‌తో మాట్లాడుతూ, “యువతి ఆమె కుటుంబం మంచర్‌కు చెందినవారు. ఆమె ఇక్కడ ఒక పీజీలో నివసించేది. కుటుంబ కలహాల కారణంగానే కిడ్నాప్ జరిగింది. మేము ఆమె భర్త, అత్తమామలపై కేసు నమోదు చేస్తున్నామని తెలిపారు.