West Bengal Horror: దారుణం, స్కూలు సెలవు కోసం 1వ తరగతి బాలుడ్ని చంపిన 8వ తరగతి విద్యార్థి, స్కూల్ సమీపంలోని చెరువులో లభించిన మృతదేహం
పశ్చిమ బెంగాల్‌లోని పురులియా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్కూల్‌కు సెలవు కోసం ఎనిమిదవ తరగతి విద్యార్థి ఒకటవ తరగతి బాలుడ్ని చెరువులో ముంచి (Student Drowns Boy for holiday) హత్య చేశాడు
Kolkata, Feb 7: పశ్చిమ బెంగాల్‌లోని పురులియా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్కూల్‌కు సెలవు కోసం ఎనిమిదవ తరగతి విద్యార్థి ఒకటవ తరగతి బాలుడ్ని చెరువులో ముంచి (Student Drowns Boy for holiday) హత్య చేశాడు. జనవరి 30న ప్రైవేట్ స్కూల్‌లో ఫస్ట్ క్లాస్ చదువుతున్న విద్యార్థి అదృశ్యమవ్వడంతో ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు రెండు రోజుల తర్వాత స్కూల్ సమీపంలోని చెరువులో పసి బాలుడి మృతదేహాన్ని గుర్తించారు.
ముంబైలో దారుణం, చాక్లెట్ ఆశ చూపి నాలుగేళ్ల బాలికపై స్కూల్ టాయెలెట్లో వాచ్‌మెన్ అత్యాచారం
బాలుడి తలపై కొట్టిన గాయాలున్నట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తెలిసింది. బాలుడి మృతిపై దర్యాప్తు చేసిన పోలీసులకు దిమ్మతిరిగే విషయాలు తెలిశాయి. బాలుడి మిస్సింగ్ నుంచి స్కూలుకు రాని ఎనిమిదవ తరగతి విద్యార్థిపై అనుమానంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. విచారణలో 8వ తరగతి స్టూడెంట్ ఆ బాలుడ్ని చెరువు వద్దకు తీసుకెళ్లి తలపై కొట్టి నీటిలో పడేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు
(The above story first appeared on LatestLY on Feb 07, 2024 08:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

