India Post Aircraft: బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన విమానం, పశ్చిమ బెంగాల్‌‌లో ఘటన, బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు,కోల్‌కతా విమానాశ్రయంలో మూలన పడి ఉన్న డజనుకు పైగా విమానాలు
Truck Carrying Abandoned India Post Aircraft Stuck in West Bengal (Photo Credits: ANI)

Kolkata, December 24: పశ్చిమ బెంగాల్‌లోని(West Bengal) బర్ధమాన్ జిల్లాలోని దుర్గాపూర్‌లో ( DURGAPUR)ట్రక్కుపై తరలిస్తున్న ఎయిర్‌క్రాఫ్ట్‌ బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన వైనం మంగళవారం వెలుగు చూసింది. భారత తపాలా శాఖకు చెందిన ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ (India Post Aircraft) కొంతకాలం నుంచి నిరూపయోగంగా ఉంది. నేషనల్ హైవే-2 బ్రిడ్జి కింద ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇరుక్కుపోయింది. దీంతో విషయం తెలుసుకున్న తపాలా శాఖ అధికారులు దుర్గాపూర్‌కు చేరుకున్నారు.

ఎయిర్‌క్రాఫ్ట్‌ను బ్రిడ్జి కింద నుంచి బయటకు తీసేందుకు పోలీసులు, అధికారులు చర్యలు చేపట్టారు. సోమవారం రాత్రి ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ బ్రిడ్జి కింద ఇరుక్కున్నట్లు అధికారులు వెల్లడించారు.సోమవారం (డిసెంబర్ 23) రాత్రి ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ బ్రిడ్జి కింద ఇరుక్కున్నట్లు అధికారులు వెల్లడించారు.ఈ విషయాన్ని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ట్వీట్ చేసింది.

TOI యొక్క నివేదిక ప్రకారం, రిజిస్ట్రేషన్ నంబర్ VT-EGG ఉన్న బోయింగ్ B737 విమానం గత ఐదేళ్ళుగా విమానాశ్రయ మైదానంలో ఉంచబడింది. ఈ విమానం 2014 లో గ్రౌండ్ చేయబడింది. అప్పటి నుండి కోల్‌కతా విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ల్యాన్ ముందు పడి ఉంది. ఇండియా పోస్ట్ ఈ విమానాన్ని కోల్‌కతా రహదారులపై కంటెయినర్ల ద్వారా తీసుకెళ్తున్నప్పుడు జెస్సోర్ రోడ్‌లోని వాహనదారులు ఈ భారీ విమానం చూసి ఆశ్చర్యపోయారని తెలిపింది.

Here's the tweet:

కోల్‌కతా విమానాశ్రయంలో (Kolkata Airport) దాదాపు డజను విమానాలు ఇప్పటికీ పనిలేకుండా ఉన్నాయని TOI నివేదిక పేర్కొంది. ఈ విమానాలన్నీ కాలం చెల్లినవిగా చెత్తలోకి వెళ్లడానికి వేచి ఉన్నాయి. కాగా B737 విమానం పూర్వపు ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందినది. దీనిని ఇండియా పోస్ట్ తన జీవితపు ఫాగ్ ఎండ్ వైపు ఉపయోగించిందని TOI తెలిపింది.