Lucknow, SEP 08: ఆంబర్ గ్రిస్ అంటే తిమింగలం వాంతి (Whale Vomit). చాలా ఖరీదైనది. వాంతి ఖరీదు అయినది అంటే కాస్త ఆశ్చర్యమే అనిపిస్తుంది. కానీ ఇది నిజం. సముద్రాల్లో జీవించే తిమింగలం చేసుకునే వాంతికి మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే తిమింగలం వాంతిని సుగంధ పరిమళ ద్రవ్యాలు, కాస్మెటిక్స్ (Cosmotics), ఔషధాల తయారీలో వినియోగిస్తారు.దీంతో దీనికి మంచి ధర పలుకుతుంటుంది. విదేశాల్లో తిమింగలం వాంతి లభ్యమై కోటీశ్వరులు అయినవారు ఉన్నారు. కానీ భారత్ లో మాత్రం తిమింగలం వాంతిని అమ్మటంపై నిషేధం ఉంది. భారత్ లో తిమింగలం వాంతి (Whale Vomit) అమ్మకాలపై నిషేధం ఉన్నా కొంతమంది అమ్ముతుంటారు. తిమింగలం వాంతి అమ్మి కోటీశ్వరులు అయ్యారనే వార్తలు వింటుంటాం.ఈ విషయం అధికారులకు సమాచారం అందితే మాత్రం నేరంగా పరిగణించబడుతుంది. ఇది దొరికినా అమ్మటం నిషేధం.. స్పెషల్ టాస్క్ ఫోర్స్ లీసులు పట్టుకుంటారు.

ఇదిలా ఉంటే..ఈక్రమంలో తిమింగలం వాంతిని అమ్ముతున్న కొంతమందిని యూపీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 4.12 కిలోల బరువుగల రూ.10కోట్ల విలువైన తిమింగలం వాంతిని స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో దీని ఖరీదు రూ.10 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. ఆంబర్ గ్రిస్ కలిగి ఉన్నారన్న పక్కా సమాచారంతో ఉత్తరప్రదేశ్ పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (UPSDF) లక్నోలోని గోమతీనగర్ ప్రాంతంలో దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో నలుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు.ఎంతో సువాసన..ప్రత్యేక గుణాలు కలిగిన తిమింగలం వాంతిని సుగంధ పరిమళ ద్రవ్యాలు, కాస్మెటిక్స్, ఔషధాల తయారీలో వినియోగిస్తారు. తిమింగలం వాంతితో తయారైన పెర్ఫ్యూమ్ లు అత్యంత ఖరీదైనవిగా ఉంటాయి.వైల్డ్ లైఫ్ (ప్రొటెక్షన్) యాక్ట్ 1972 ప్రకారం తిమింగలం వాంతి అమ్మకాలపై నిషేధం ఉంది.

PM-SHRI Schools: పీఎం–శ్రీ స్కూళ్ల పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం, పీఎం–శ్రీ కింద ఐదేళ్లలో రూ.27,360 కోట్లతో దేశవ్యాప్తంగా 14,597 పాఠశాలల అభివృద్ధి 

తిమింగలాల్లో ముఖ్యంగా స్పెర్మ్ వేల్ రకం తిమింగలాల (Whales) నోటి నుంచి వచ్చే మైనం వంటి చిక్కని పదార్థాన్ని ఆంబర్ గ్రిస్ లేక గ్రే ఆంబర్, లేక నీటిపై తేలే బంగారం అని పిలుస్తుంటారు. సహజసిద్ధంగా లభించే ఈ పదార్థం అరుదైనది, అత్యంత విశిష్టమైనది కావడంతో అతి భారీ ధర పలుకుతుంది. గత జులైలో కేరళ మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లగా రూ.28 కోట్ల విలువైన ఆంబర్ గ్రిస్ వారి కంటపడగా, దాన్ని వారు అధికారులకు అప్పగించారు. ఈ ఆంబర్ గ్రిస్ తిమింగలాల జీర్ణవ్యవస్థ నుంచి నోటి ద్వారా వెలుపలికి విసర్జితమయ్యే ఓ పదార్థం. ఇది తిమింగలం పేగుల్లో ఉత్పత్తి అవుతుంది. అదన్నమాట తిమింగలం వాంతికి ఉన్న రేంజ్.