Coronavirus in India (Photo Credits: IANS)

New Delhi, April 9:  భారతదేశంలో రోజురోజుకి వందల సంఖ్యలో COVID-19 కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 540 కొత్త కేసులు నమోదు కావడంతో భారతదేశంలో మొత్తం  కరోనావైరస్ పాజిటివ్ కేసుల  (COVID-19 in India) సంఖ్య 5,734 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ((Ministry of Health and Family Welfare)) తెలిపింది.

అధికారిక వెబ్‌సైట్‌లోని డేటా ప్రకారం, ఇప్పటివరకు మొత్తం నమోదైన కేసుల్లో 5,095 క్రియాశీల కేసులు ఉన్నాయి. నిన్న మరో దేశవ్యాప్తంగా మరో 17 కోవిడ్-19 మరణాలు నమోదు కావడంతో ఈ వ్యాధి సోకి చనిపోయిన వారి సంఖ్య 166 కు పెరిగింది. ఇప్పటివరకు 473 మంది ఈ వైరస్ బారి నుండి కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.  ప్రైవేట్ ఆసుపత్రులైనా, ల్యాబ్‌లలోనైనా కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేయాలి: సుప్రీం కోర్టు

మార్చి 24న ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన 21 రోజుల దేశవ్యాప్త లాక్డౌన్ మరో 5 రోజుల్లో ముగియనుంది. అయితే కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ఈ లాక్డౌన్ మరింత కాలం పొడగించడం తప్పేలా లేదు. ఈనెల 11న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరిపిన తర్వాత పీఎం మోదీ లాక్డౌన్ పొడగింపుపై నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

Here's the update:

ఇక రాష్ట్రాల వారీగా కోవిడ్-19 కేసుల సరళిని పరిశీలిస్తే, మహారాష్ట్రలో వైరస్ తీవ్రత అధికంగా ఉంది. మహారాష్ట్రలో గురువారం ఉదయం నాటికి పాజిటివ్ కేసుల సంఖ్య 1135కు చేరింది. ఇందులో సుమారు 70 శాతం కేసులు ముంబై నగరం నుంచే ఉన్నాయి.  తమిళనాడులో 738 కేసులు, దిల్లీలో 669 కేసులు, తెలంగాణలో 453 కేసులతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.