Lucknow, December 08: ఒక వ్యక్తి మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సిగరెట్‌తో ఆమె ముఖాన్ని కాల్చాడు. ఆ తర్వాత గొడ్డలితో నరికి చంపాడు. (Woman Raped, Killed with Axe) ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో ఈ దారుణం జరిగింది. సూరజ్ కుమార్ సోంకర్‌కు ఉద్యోగం ఇప్పిస్తానని ఒక మహిళ నమ్మించి డబ్బులు తీసుకుంది. అయితే అతడికి ఉద్యోగం ఇప్పించడంలో ఆమె విఫలమైంది. దీంతో తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అతడు డిమాండ్ చేశాడు. అయితే డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో అతడు ఆగ్రహించాడు.
ఈ నేపథ్యంలో డిసెంబర్ 3న ఆ మహిళపై అత్యాచారం చేశాడు. సిగరెట్లతో ఆమె ముఖంపై కాల్చిన వాతలు పెట్టాడు. అంతటితో ఆగక గొడ్డలితో నరికి చంపాడు. కాగా, సుల్తాన్‌పూర్‌లో రోడ్డు పక్కన మహిళ మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో మహిళ హత్యపై దర్యాప్తు చేశారు. నిందితుడు సూరజ్ కుమార్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు. ఎలక్ట్రిక్ ఆటో, మొబైల్ ఫోన్, గొడ్డలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.