Pratapgarh, March 21: రైల్వే స్టేషన్ లో మరుగుదొడ్డికి వెళ్లిన ప్రయాణికురాలిని వదల్లేదు కామాంధులు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌ఘర్ జంక్షన్‌లో ట్రైన్ ఎక్కేందుకు వచ్చారు భార్యభర్తలు. ట్రైన్ రావడానికి ఇంకా సమయం ఉండటంతో భార్య ఆకలి వేస్తోందని అడిగింది. ఆమెకు తినడానికి ,తాగడానికి ఏవైనా తీసుకొద్దామని రైల్వేస్టేషన్ బయట ఉన్న షాపు దగ్గరకు వెళ్లాడు ఆమె భర్త, అతను వచ్చే వరకు బాధితురాలు రైల్వే స్టేషన్‌లోని వెయిటింగ్ రూమ్‌లో కూర్చుంది. తెల్లవారు జామున 4గంటల సమయం కావడంతో మధ్యలో ఆమె కాలకృత్యాలు తీర్చుకునేందుకు రైల్వే స్టేషన్‌లోని పబ్లిక్ టాయిలెట్‌కి వెళ్లింది. అక్కడే ఆమె కోసం కాచుకొని కూర్చున్న కామాంధులు బలత్కారం చేశారు. బాధిత మహిళ అపస్మారకస్థితిలోకి వెళ్లిపోగానే అక్కడి నుంచి పారిపోయారు.
తినడానికి ఏమైనా తెచ్చేందుకు వెళ్లిన భర్త తిరిగి వచ్చేలోగా వెయిటింగ్ రూమ్‌లో తన భార్య కనిపించకపోవడంతో షాక్ అయ్యాడు భర్త. భార్యను వెదుక్కుంటూ యువకుడు రైల్వే స్టేషన్ మొత్తం తిరిగాడు. చివరకు మరుగుదొడ్డి దగ్గరకు వెళ్లడంతో అక్కడే అక్కడ అపస్మారకస్థితిలో పడివున్న భార్యను చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె ముఖంపై నీళ్లు చల్లాడు. బాధిత మహిళ స్పృహలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. యువకుడు రైల్వే స్టేషన్ బయటకు వెళ్లిన సమయంలో మహిళ మరుగుదొడ్లోకి వెళ్లడం చూసిన స్వీపర్ అతని సోదరుడు తన భార్యపై అత్యాచారం చేసి పారిపోయారని తెలిసి షాక్ తిన్నాడు.
భార్య షాకింగ్ న్యూస్ విన్న భర్త ఆమెను వెంటపెట్టుకొని రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రయాణికురాలిపై అఘాయిత్యం చేసింది టాయిలెట్స్ క్లీన్ చేసే సిబ్బంది కావడంతో వెంటనే పోలీసులు ఘటన స్తలానికి చేరుకున్నారు. ఈకేసులో ప్రయాణికురాలిపై అత్యాచారం చేసింది టాయిలెట్స్ క్లీన్ చేసే వ్యక్తి సోదరుడు కావడంతో అతనిపై అత్యాచారం కేసు నమోదు చేశారు. అన్నకు సహాకరించిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. నిత్యం వేలాది మంది ప్రయాణికులు ఉండే రైల్వే స్టేషన్‌లో ఆవరణలోనే మహిళా ప్రయాణికురాలిపై ఇంతటి దారుణానికి ఒడిగట్టిన విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రయాణికురాలిపై అత్యాచారం చేసిన వ్యక్తి రైల్వే టాయిలెట్స్ దగ్గర పనిచేస్తున్న వర్కర్ కావడంతో అతనిపై కూడా కేసు నమోదు చేశారు. పారిపోయిన సోదరుడి ఆచూకి గురించి ఆరా తీస్తున్నారు ప్రతాప్‌ఘర్ పోలీసులు.