Woman Slaps MLA (PIC@ ANI Twitter)

Chandigargh, July 13: వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్లిన ఎమ్మెల్యేను ఓ మహిళ చెప్పుతో కొట్టింది. తమ ఊరంతా వరద నీటిలో మునిగిపోయింది.. ఇప్పుడెందుకు వచ్చావ్‌ అంటూ నిలదీసింది. దీంతో చేసేదేం లేక ఆ ఎమ్మెల్యే అక్కడి నుంచి వెనుతిరిగిన ఘటన హర్యానాలోని ఘులా చోటుచేసుకుంది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హర్యానాలోని (Haryana) ఘగ్గర్‌ నది (Ghaggar river) పొంగి పొర్లు తున్నది. దీంతో భారీ వరదలతో (Floods) ఘులా (Ghula) ప్రాంతం పూర్తిగా నీటమునింది.

ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని పరిశీలించడానికి స్థానిక జననాయక్‌ జనతా పార్టీ (JJP) ఎమ్మెల్యే ఈశ్వర్‌ సింగ్‌ (MLA Ishwar Singh) వెళ్లారు. తమ ఇండ్లు నీట మునిగి దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రజలు.. తమను ఎవరు పట్టించుకోలేనే కోపంతో ఉన్నారు. ఎమ్మెల్యే తమ ప్రాంతానికి రావడంతో అతడిని చుట్టముట్టారు. వారిలో ఓ మహిళ (Woman) తన చెప్పు ఎమ్మెల్యే చెంపపై ఒక్కటేసింది (Slapped). ఇక్కడేముందని చూడటానికి వచ్చావంటూ ప్రశ్నించింది. నదిపై కట్టి చెక్‌డ్యాం వల్లే తమకు ఈ పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తంచేసింది. అయితే ఎమ్మెల్యే సహాయకులు సర్ధిచెప్పడంతో ఆమె శాంతించింది.

Uttarakhand Floods: ఉత్తరాఖండ్‌లో కొండ చరియలు ఎలా విరిగిపడుతున్నాయో వీడియోలో, నిలిచిపోయిన రెస్క్యూ ఆపరేషన్ సేవలు 

కాగా, తాను ఆమె బాధను అర్థం చేసుకోగలనని ఎమ్మెల్యే ఈశ్వర్‌ సింగ్‌ చెప్పారు. ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. చెక్‌ డ్యాం వల్ల వరదలు రాలేదని.. భారీ వర్షాలే దానికి కారణమని ఆ మహిళతో చెప్పినట్లు వెల్లడించారు. జేజేపీ అధికార బీజేపీ (JJP) మిత్రపక్షం కావడం గమనార్హం. అయితే ఎమ్మెల్యేను చెప్పుతో కొట్టిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.