New Delhi, AUG 21: దేశంలోని 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పురుషులకంటే మహిళలకే శృంగార భాగస్వాములు (Sex Partners) ఎక్కువగా ఉన్నారని తాజా సర్వే తేల్చింది. 2019-2021కి సంబంధించి కేంద్రం నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశంలోని 707 జిల్లాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో, 1.1 లక్ష మంది మహిళలు, 1 లక్ష మంది పురుషులపై నిర్వహించిన సర్వే (Survey) ద్వారా ఈ సంచలన విషయాలు తెలిశాయి. సర్వే నిర్వహించడానికి 12 నెలల ముందు వరకు వివరాల్ని అడిగి తెలుసుకుని ఈ నివేదిక రూపొందించారు. సర్వే ప్రకారం.. రాజస్థాన్ (Rajasthan), హరియాణా, జమ్ము-కాశ్మీర్, లదాఖ్, మధ్యప్రదేశ్, అసోం, కేరళ, ఛండీఘర్, లక్షద్వీప్, పుదుచ్చేరి, తమిళనాడులో మహిళలు ఒకరికంటే ఎక్కువ మంది శృంగార భాగస్వాముల్ని కలిగి ఉన్నారు.
అన్నింటికంటే ఎక్కువగా రాజస్థాన్‌లో మహిళలు ఎక్కువ మంది శృంగార భాగస్వాముల్ని కలిగి ఉన్నారు. ఈ రాష్ట్రంలో మహిళలు సగటున 3.1 మంది భాగస్వాముల్ని కలిగి ఉంటే, పురుషులు 1.8 మంది భాగస్వాముల్ని కలిగి ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లోని వారికంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఇలా ఎక్కువ మంది శృంగార భాగస్వాములున్నారు (Sex Partners). ఇక తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మహిళలతో పోలిస్తే పురుషులకే ఎక్కువ మంది శృంగార భాగస్వాములున్నారు.
ఏపీలో ఒక్కో పురుషుడికి సగటున 4.7 మంది మహిళలతో సంబంధాలు ఉండగా, మహిళలకు 1.4 మందితో సంబంధం ఉంది. తెలంగాణలో పురుషులకు 3.0 మంది మహిళలతో సంబంధాలు ఉండగా, స్త్రీలకు సగటున 1.7 మందితో భాగస్వామ్యం ఉంది. ఈ సర్వే నిర్వహించిన ఏడాది కాలానికి సంబంధించి తమ జీవిత భాగస్వామితో మాత్రమే శృంగారంలో పాల్గొన్నామని చెప్పిన పురుషులు 4 శాతంకాగా, మహిళలు 0.5 శాతం మాత్రమే ఉన్నారు.