Image From Twitter

Lucknow, OCT 16: పరోక్షంగా హిందువులను ఉద్దేశించి ఏఐఎంఐఎం నేత (MIM Leader) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘మీరు ఒకర్నే పెళ్లి చేసుకుంటావు. కానీ ముగ్గురితో సంబంధం పెట్టుకుని పిల్లల్ని కంటుంటావు’’ అంటూ ఉత్తరప్రదేశ్ ఏఐఎంఐఎం నేత షౌకత్ అలీ (Shaukat Ali) అన్నారు. మత విధ్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య సామరస్య వాతావరణాన్ని చెడగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారన్న కోణంలో ఆయనపై కేసు నమోదు చేసినట్లు ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ (Viral video)అవుతున్న ఒక వీడియో ప్రకారం.. ‘‘భారతీయ జనతా పార్టీ ఓడిపోయినప్పుడల్లా ముస్లింల మీద పడుతుంది. ముస్లింలు ఎక్కువ మంది పిల్లల్ని కంటారు, వారికి ఎక్కువ మంది భార్యలు ఉంటారని అంటారు. నిజమే మేము రెండుసార్లు పెళ్లి చేసుకుంటాం. కానీ ఇద్దరు భార్యల్ని ఒకేలా చూస్తాం. కానీ, మీరు పేరుకు ఒకర్నే పెళ్లి చేసుకుంటారు. కానీ తెలియకుండా మూడు, నాలుగు సంబంధాలు ఉంటాయి. వారితో పిల్లల్ని కూడా కంటారు. కానీ వీరిలో ఎవరికీ కనీస గౌరవం ఇవ్వరు’’ అని షౌకత్ అలీ (Shaukat Ali) అన్నారు.

Triple Talaq for Car: కట్నంగా కారు ఇవ్వలేదని ఫోన్‌లోనే త్రిపుల్ తలాక్‌ చెప్పిన వ్యక్తి, కొత్త జాబ్ వచ్చింది కొన్నాళ్లూ మీ ఇంటికి వెళ్లు అంటూ...భార్యను పుట్టింటికి పంపిన తర్వాత తలాక్ చెప్పాడు, ఐదేళ్ల నుంచి అత్తింటివారిని కారుకోసం వేధిస్తున్న ఇమ్రాన్ 

ఇక జోదాను అక్బర్ పెళ్లి చేసుకోవడాన్ని ఆయన ప్రస్తావించారు. తాము హిందువులను పెళ్లి చేసుకుని సామాజిక స్థాయిని పెంచడానికి ప్రయత్నిస్తే.. వారు మాత్రం తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. వాస్తవానికి మొఘల్ రాజుల ముందు గులాము చేసిన వారే నేడు తమను బెదిరిస్తున్నారని అలీ అన్నారు.

Ekta Kapoor: యువతను చెడగొడుతున్నావ్! ఏక్తా కపూర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం, XXX వెబ్‌ సిరీస్‌పై కేసులో ఏక్తాకు ఎదురదెబ్బ, ప్రతిసారి కోర్టును ఆశ్రయించడం సరికాదు, కోర్టు ఉన్నది నోరులేని వారికోసం, ఏక్తాకపూర్‌పై అరెస్ట్ వారెంట్, కేసును సమర్ధించిన అత్యున్నత న్యాయస్థానం 

‘‘832 ఏళ్లు మేము మిమ్మల్ని పాలించాం. మీరంతా చేతులు కట్టుకుని వెనక్కి నిలబడి జీ హుజూర్ అన్నారు. కానీ ఈరోజు మమ్మల్ని బెదిరిస్తున్నారు. మాకంటే సెక్యూలర్ ఎవరున్నారు? ఇన్నేళ్లు ఈ దేశాన్ని పాలించినా, ఈ దేశాన్ని ఇస్లాం దేశంగా మార్చలేదు’’ అని అలీ అన్నారు. కాగా, షౌకత్ అలీపై భారత శిక్ష స్మృతిలోని సెక్షన్ 153ఏ, 295ఏ, 188 కింద కేసులు నమోదు చేసినట్లు సంభాల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఛక్రేష్ మిశ్రా ఆదివారం తెలిపారు.