COVID-19 Study Representative Image (Photo Credits: Pixabay)

న్యూఢిల్లీ, జనవరి 18: కరోనా మహమ్మారిపై పోరులో భారత్ కీలక మైలురాళ్లను దాటుతోంది. దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలై జనవరి 16తో ఏడాది పూర్తయింది. ఈ ఏడాది జనవరి 10 నుంచి 15 నుంచి 18ఏళ్లలోపు పిల్లలకు కూడా టీకాల పంపిణీ కూడా మొదలైంది. మరోవైపు కొత్తగా పుట్టుకొచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ పిల్లల పాలిట ప్రమాదకారిగా మారడంతో కౌమారదశలోని పిల్లలు అందరికీ వ్యాక్సిన్లు అందించే దిశగా భారత ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.

ఇదిలా ఉంటే పిల్లల కొవిడ్ టీకా డ్రైవ్ పరిధిని విస్తరిస్తూ 12 నుంచి 14 ఏళ్లలోపు వారికి కూడా వ్యాక్సిన్లు అందించనున్నారనే వార్తలను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఖండించింది. ఇక జనవరి 3న 15 నుంచి 18 ఏళ్లలోపు వారికి టీకాలు వేయడం ప్రారంభించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3.5 కోట్ల మంది ఈ వయస్సు వారికి మొదటి డోస్ వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు.