Chennai, October 12: తమిళనాడు పర్యటనకు వెళ్తున్న ప్రతిసారి ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతకుముందు ఆయన అక్కడకు వెళ్లిన క్రమంలో 'గోబ్యాక్ మోడీ' హ్యష్‌టాగ్ పేరుతో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రెండింగ్ నడిచింది. తాజాగా భారత్ పర్యటనలో భాగంగా తమిళనాడుకు వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు స్వాగతం పలికేందుకు అక్కడకు వెళ్లిన మోడీకి కూడా అదేవిధమైన అనుభవం ఎదురైంది. ఈసారి 'గోబ్యాక్ మోడీ'తో పాటు 'గోబ్యాక్ శాడిస్ట్ మోడీ' అనే హ్యాష్‌ట్యాగ్ కూడా విపరీతంగా ట్రెండ్ అయింది.శుక్రవారం భారత్‌లో ట్రెండింగ్ అయిన హ్యాష్‌ట్యాగ్‌లో ఈ రెండు ప్రథమ స్థానంలో నిలిచాయి. అయితే ఇది భారీ కుట్రని తేలిపోయింది. పాకిస్తాన్ వేదికగా ఈ ట్రెండింగ్ నడుస్తోందని తెలుస్తోంది. అక్కడి నుంచే ఈ యవ్వారమంతా నడిపిస్తున్నారని దాన్ని తమిళులపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆధారాలు బయటకు వచ్చాయి.
పాకిస్తాన్ వేదికగా..
دنیا کی انسانیت بھی مرگئی امت پربےہوشی تاری صرف کشمیرکےبازار ہاسپیٹل سروس بندنہیں کان بھی بند
جومعصوموں کی چیخیں سنائی نہیں دیتی😥#GoBackModi#FreeKashmirFromHitler#Crush_Endia #StopGenocideOfMuslims#Modi_Is_Butcher pic.twitter.com/v3Ag8PFis1
— Ch. Ayyoub Maan 🇵🇰 (@ayyoubsabirmaan) October 11, 2019
అయితే తమిళనాడులో ప్రధాని మోడీ పర్యటను కొందరు మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. వారి వల్ల ఈ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చే అవకాశమే లేదు. అయితే, ఇది ఎలా జరుగుతోందని లోతుగా గమనిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇదంతా దాయాది దేశం కుట్రలని తేలిపోయింది.
దాయాది దేశం కుట్ర
#GoBackModi is trending in Facebook. Let’s put our share and congratulate @ImranKhanPTI @OfficialDGISPR @peaceforchange for taking Modi to this level
— Muzzammil Aslam (@MuzzammilAslam3) October 11, 2019
ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు పాకిస్థాన్‌కు మింగుడు పడటం లేదు. దీంతోనే ఆయనకు వ్యతిరేకంగా ఇలాంటి కుట్రలు చేస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా ఇలా #GOBACKMODI హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ప్రధాని మోడీ ఎప్పుడు తమిళనాడు వెళ్లినా.. ఇలా పాకిస్థాన్‌కు చెందినవారు వివిధ పేర్లతో ఉన్న ట్విట్టర్ హ్యాండిల్స్‌తో #GOBACKMODI ట్రెండ్ చేస్తున్నారు.
#GOBACKMODI ట్రెండ్
Real Face of I N D I A
India #RSS_Hindutva_Extremists
Vandalised Mosque in Bihar!
And pelted stones inside.
Holy Quran being thrown & it's a blasphemy of Holy Book.#GoBackModipic.twitter.com/dd6UztQbzg
— Malik Qaiser Thethia (@Thethia1) October 11, 2019
ప్రపంచ దేశాల మద్దతు కూలగొట్టడంలో విఫలమైన పాకిస్థాన్.. ఇలా భారత్‌పై తన అక్కసును వెల్లగక్కుతోంది. శుక్రవారం(అక్టోబర్ 11న) చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తమిళనాడులోని మహాబలిపురంలో పర్యటించినప్పుడు కూడా ఇదే ట్రెండ్ అయింది.
58 శాతం అక్కడి నుంచే
Truth about #GoBackModi trend
58% tweets from Pakistan
4% from Chennai
2% in Tamil & 23% in Urdu
Wow what a MahaGathBandhan - in name of Tamilians - ISI Bots + Congress + Commies + Pakis trend #GoBackModi against @narendramodi
Exposed on @TimesNow now @RShivshankar pic.twitter.com/w50zheTA6H
— Shehzad Jai Hind (@Shehzad_Ind) October 11, 2019
కాగా ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి ఆయన మహాబలిపురం ఆలయాన్ని సందర్శించారు. ప్రధాని మోడీ ఆలయ విశేషాలను జిన్‌పింగ్‌కు వివరించారు. ఇరుదేశాలకు సంబంధించిన ఇతర కీలక విషయాలపై ఇరువురు నేతలు చర్చించారు. చైనా, భారత్ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకే ఈ భేటీ జరుగుతుండటం గమనార్హం. ఈ భేటీలో ఎలాంటి ఒప్పందాలు జరగవని ప్రభుత్వ వర్గాలు తేల్చాయి.
ఇద్దరు అగ్ర నేతల కలయిక
俯瞰孟加拉湾是雄伟的海岸寺庙。海岸寺庙是印度最具标志性的地标之一,体现了印度文化的伟大和宏伟。
这是海岸寺庙的一些照片。 pic.twitter.com/3BSwlqkjK9
— Narendra Modi (@narendramodi) October 11, 2019
కొన్ని రోజుల క్రితం సెప్టెంబర్ 30న చెన్నైలోని ఐఐటి 50వ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు అక్కడకు వెళ్లిన ప్రధాని మోడీకి ఇదేవిధంగా సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేకంగా ట్రెండింగ్ నడిచింది. ఇక 2018 ఏప్రిల్‌లో రక్షణ రంగ ఉత్పత్తుల ఎగ్జిబిషన్‌ను ప్రారంభించడానికి మోడీ తమిళనాడు వచ్చారు. అదేరోజు కావేరీ నీటి నిర్వహణ అథారిటీని ఏర్పాటు చేయడంలో కేంద్ర ఫ్రభుత్వ ఆలసత్వ వైఖరిని నిరసిస్తూ నల్లజెండాలు, నల్ల రిబ్బన్లతో ఆన్‌లైన్ నిరసనలు జరిగాయి. అదేవిధంగా ఈ ఏడాది జనవరి 27న ఎయిమ్స్ శంకుస్థాపనకు మధురై వచ్చిన సమయంలో కూడా ప్రధానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ నడిచింది.