New Delhi, December 14: పౌరసత్వ సవరణ బిల్లుతో (Citizenship Amendment Act 2019) దేశం తగలిబడి పోతున్నా మోడీ-షాలకు(Modi-Shah) పట్టటం లేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi)ఘాటుగా విమర్శించారు.దేశంలో ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, అధిక ధరలతో ప్రజలు అల్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. అందుకు అసోం, ఇతర ఈశాన్యా రాష్ట్రాలే నిదర్శనమని ఆమె తెలిపారు.
మోడీ-షా వీరిద్దరూ రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తూ తమకు ఇష్టమొచ్చినట్టుగా పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.భారత్ బచావో ర్యాలీలో(Bharat Bachao Rally) ఎంపీ రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా, సీనియర్ నేత చిదంబరం, తదితరులు పాల్గొన్నారు.
ANI Tweet:
Sonia Gandhi, Congress Interim President at the party's 'Bharat Bachao' rally, in Delhi: Modi-Shah are not bothered at all that #CitizenshipAmendmentAct will shred the soul of India, just like it is happening in Assam and other states of the northeast. pic.twitter.com/PTzay0Gur0
— ANI (@ANI) December 14, 2019
సోనియా గాంధీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని రాంలీలా మైదానంలో శనివారం, డిసెంబర్ 14న కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ బచావో ర్యాలీలో సోనియా మాట్లాడారు.తమకు కావాల్సిన చోట రాజ్యాంగ అధికరణలను విధిస్తూ, అధికరణలను రద్దు చేస్తూ రాష్ట్రాల హోదాలను మార్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘సబ్ సాత్, సబ్ కా వికాస్’ హామీ ఏమైందని సోనియా గాంధీ ప్రశ్నించారు.
మహారాష్ట్ర(maharashtra)లో రాష్ట్రపతి పాలన ఎత్తేసి ఎటువంటి చర్చ లేకుండానే తమకు కావాల్సిన బిల్లులు ఆమోదించుకున్నారని పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, అధిక ధరలతో ప్రజలు అల్లాడుతున్నారని ఆమె అన్నారు. మోడీ సర్కారు(Modi GOVT) దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని.. యువతకు ఉద్యోగాలు లేవని, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించలేకపోయిందని విమర్శించారు.
ఆరు నెలల నరేంద్ర మోడీ పాలన దేశ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసిందని, ఇప్పటికీ మంత్రులకు దీనిపై అవగాహన లేకుండా పోయిందని మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం అన్నారు. ‘ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న కూడా పార్లమెంట్‌లో మాట్లాడుతూ దేశ ఆర్థిక పరిస్థితి చాలా బాగుందని.. ఆర్థికాభివృద్ధిలో ప్రపంచంలో మనం అగ్రభాగాన ఉన్నామని చెప్పారు. ఎవరు ఏది అడిగినా మంచి కాలం రాబోతుందనే ఆమె సమాధానం చెబుతార’ని చిదంబరం ఎద్దేవా చేశారు