Subramanian Swamy: గాంధీ హత్య కేసు రీ-ఓపెన్ చేయాలి, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కీలక వ్యాఖ్యలు, ట్విట్టర్లో వరుసగా ప్రశ్నలు సంధించిన బీజేపీ ఎంపీ
Subramanian Swamy. (Photo Credits: ANI/File)

New Delhi, Febuary 17: జాతిపిత మహాత్మాగాంధీ హత్య కేసుపై బీజేపీ ఎంపీ (BJP MP) సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ హత్య కేసును రీ-ఓపెన్ చేయాలంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి (BJP MP Subramanian Swamy) ట్విటర్‌ వేదికగా సంచలన వాఖ్యలు చేశారు. గాంధీ హత్య కేసును (Mahatma Gandhi Murder Case) రీఓపెన్ చేసి పునర్విచారణ జరిపించాలని ఆయన కోరారు.

జాతిపిత హత్యపై ఆయన ట్విట్టర్లో వరుసగా ప్రశ్నలు సంధించారు. గాంధీ మృతదేహానికి ఎందుకు పోస్టుమార్టమ్ నిర్వహించలేదని ఆయన ఈ సంధర్భంగా ప్రశ్నించారు. ప్రత్యక్ష సాక్షులైన అభా, మనులను కోర్టులో ఎందుకు విచారించలేదన్నారు. గాడ్సే కాల్చిన రివాల్వర్‌‌ను ఇప్పటివరకు ఎందుకు పట్టుకోలేకపోయారని ప్రశ్నించారు. అందుకే కేసును రీఓపెన్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

అసోసియేటెడ్ ప్రెస్ ఇంటర్నేషనల్ జర్నోను బీజేపీ ఎంపీ ప్రస్తావిస్తూ.. ఆరోజు సాయంత్రం 5.05 గంటలకు అతను 4 బుల్లెట్ శబ్దాలు విన్నాడని చెప్పారు. అయితే గాడ్సే మాత్రం తాను రెండుసార్లు మాత్రమే కాల్చాడని చెప్పాడన్నారు.

Here's Subramanian Swamy Tweet

ఇక ఏపీఐ జర్నలిస్టు బిర్లా హౌజ్ వద్ద గాంధీ 5.40గంటలకు చనిపోయాడని చెప్పాడని.. అంటే, 35నిమిషాల పాటు ఆయన బతికే ఉన్నారని అన్నారు. కాగా గాంధీ హత్యపై సుబ్రమణియన్‌ స్వామి చేసిన ట్వీట్లపై నెటిజెన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే 2017 అక్టోబర్‌లో ఐటీ ప్రొఫెషనల్ డా.పంకజ్ కుముద్‌చంద్ర ఫడ్నీస్ గాంధీ హత్యపై పునర్విచారణ కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గాంధీ హంతకుడు నాథురామ్ గాడ్సే నాల్గవ బుల్లెట్‌ను కాల్చాడా లేదా అన్న దానిపై కొంత అస్పష్టత ఉన్నందున ఈ హత్యను పరిశీలించాల్సిన అవసరం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

గాంధీ హత్య కేసులో గాడ్సే, దత్తాత్రేయ ఆప్టేలను 15 నవంబర్,1949లో ఉరితీశారని దేశంలో సుప్రీం కోర్టు ఏర్పాటుకు 71 రోజుల ముందు ఈ ఘటన జరిగిందని వారు తెలిపారు. అప్పట్లో సుప్రీం కోర్టు లేకపోవడం వల్ల ఈస్ట్ పంజాబ్ హైకోర్టు విధించిన మరణశిక్షను సవాల్ చేసే అవకాశం వారికి లేకుండా పోయిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్‌ను సుప్రీం కొట్టివేసింది.