జార్ఖండ్‌ (Jharkhand)లో రాజకీయ డ్రామాకు తెరపడింది. అధికార జేఎంఎం (JMM ) కూటమి శాసనసభాపక్ష నేత చంపై సోరెన్‌ (Champai Soren) శుక్రవారం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా చంపై ప్రమాణం చేశారు. రాంచీలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌.. చంపైతో ప్రమాణ స్వీకారం చేయించారు. చంపైతో పాటు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు.

ఈడీ అరెస్టు నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి జేఎంఎం నేత హేమంత్‌ సోరేన్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామా తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అధికార సంకీర్ణ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన చంపై సొరేన్‌ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన సీఎం పదవి చేపట్టారు. హేమంత్‌ సోరెన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ, ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని తెలిపిన ధర్మాసనం

Here's CM Take Oath

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)