Karnataka Assembly bypoll results 2019 LIVE UPDATES: BJP leads in 10 seats, Congress and JD(S) in 2 each (Photo-ANI)

Bengaluru, December 9: కర్ణాటక(Karnataka)లో 15 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్‌కు సంబంధించి కౌంటింగ్ ప్రారంభం అయింది. అధికార బీజేపీ(BJP)కి చెందిన మెజార్టీ అభ్యర్థులు ఆధిక్యం దిశగా కొనసాగుతున్నారు. ఎన్నికల ఫలితాల్లో తేడావస్తే ప్రభుత్వమే పడిపోయే ప్రమాదం ఉండడంతో దేశవ్యాప్తంగా ఈ ఉపపోరు ఆసక్తి రేకెత్తించింది.ప్రస్తుతం బీజేపీ 10 స్థానాల్లో ముందంజలో ఉండగా, జేడీఎస్‌(JDS), కాంగ్రెస్‌(Congress)లు చెరో రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. హోస్కెట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇతర అభ్యర్థి ముందంజలో ఉన్నారు.

15 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 5వ తేదీన పోలింగ్ (Karnataka By-Elections 2019) జరిగిన సంగతి తెలిసిందే. 15 మంది కాంగ్రెస్, జేడీఎస్ సభ్యుల అనర్హత వేటుతో పోలింగ్ జరిగిన సంగతి విదితమే. పార్టీ ఫిరాయించిన 15 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేయడంతో ఈ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈనెల ఐదో తేదీన రాష్ట్రంలోని గోకాక్‌, కాగవాడ, అథణి, యల్లాపుర, రాణేబెన్నూరు, హీరేకెరూర్‌, హోసకోటే, కె.ఆర్‌.పురం, శివాజీనగర, మహాక్ష్మి లేఅవుట్‌, యశవంతపుర, విజయనగర, కె.ఆర్‌.పేట, హుణసూరు, చిక్కబళ్లాపుర నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి.

ANI Tweet

కాంగ్రెస్‌, బీజేపీలు అన్ని స్థానాలకు పోటీ చేయగా జేడీఎస్‌ 12 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించింది. మైనారిటీ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న యడ్డ్యూరప్ప(BS Yediyurappa) తన ప్రభుత్వాన్ని నిలుపుకునేందుకు ఎక్కువ సీట్లు సాధించాల్సి ఉంది.కాగా ఎన్నికలు జరుగుతున్న స్థానాలన్నీ విపక్ష పార్టీలు గెలుపొందినవి కావడమే ఆ పార్టీలో టెన్షన్‌కు కారణం.

మొత్తంమ్మీద ఈరోజు ఉదయం పటిష్ట బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలి ఫలితాల్లో బీజేపీ 10 స్థానాల్లోనూ, కాంగ్రెస్‌ రెండింట, ఒకచోట జేడీఎస్‌ అభ్యర్థులు మెజార్టీలో ఉన్నట్టు సమాచారం. ఈ వార్తలతో కమలనాథులు ఊపిరి పీల్చుకుంటున్నారు.