Maharashtra Chief Minister Uddhav Thackeray (Photo-PTI)

Mumbai, May 1: ఓ వైపు మహారాష్ట్రలో కరోనావైరస్ (Coronavirus) విజృంభిస్తోంది. మరోవైపు ఉద్ధవ్ థాకరే సీఎం పదవి (Uddhav Thackeray) అంపశయ్యపై ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాకరేకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) శుభవార్తను అందించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న శాసనమండలి స్థానాలకు ఎన్నికలు (Maharashtra MLC Elections) నిర్వహించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ ఎన్నికల ద్వారా మ‌హారాష్ట్ర‌ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే మండలికి ఎన్నికకావడం ఆయన సీఎం పదవి సేఫ్ కావడం వంటి కీలక పరిణమాలు జరగనున్నాయి.

మే 21న మ‌హారాష్ట్ర‌లో ఖాళీగా ఉన్న 9 శాస‌న‌మండ‌లి స్థానాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నామ‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. అయితే, ఈ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప్ర‌తి ఒక్క‌రూ క‌రోనా బారిన పడకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించింది. అంద‌రూ ముఖాల‌కు మాస్కులు ధ‌రించి, సామాజిక దూరం పాటిస్తూ పోలింగ్‌లో పాల్గొనాల‌ని ఈసీ పేర్కొంది. ఉద్దవ్‌ థాకరేకు పదవీ గండం, శాస‌న మండ‌లి స‌భ్యునిగా నామినెట్ చేయాలని మంత్రివర్గం మరొకసారి అభ్యర్థన, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోని మహారాష్ట్ర గవర్నర్

అంతకుముందు రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహించాలని కోరుతూ గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ఈసీకి లేఖ రాసిన నేపథ్యంలో చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ సునీల్ అరోరా ఈ మేరకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మే 28లోపు ఎన్నికలను నిర్వహించేందుకు వీలుగా ఎన్నికలను వాయిదా వేస్తూ గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను సవరించింది. మహారాష్ట్రలో కొలువుదీరిన శివసేన ప్రభుత్వం

గత ఏడాది నవంబర్‌ 28న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇప్పటి వరకు ఆయన శాసనసభకు గానీ, మండలికిగానీ ఎన్నిక కాలేదు. మే 28 నాటికి ఆరు నెలల సమయం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఠాక్రేను మండలికి నామినేట్‌ చేయాలని కోరుతూ రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేసింది. దీనిపై గవర్నర్ గురువారం వరకూ‌ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.  లోక్‌సభలో మద్దతు, రాజ్యసభలో మద్దతు ఇవ్వం, పౌరసత్వ సవరణ బిల్లుపై స్వరం మార్చిన శివసేన, కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తేనే బిల్లుకు మద్ధతు, వెల్లడించిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే

ఈ క్రమంలోనే సీఎం ఠాక్రే ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్‌ చేసి రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని.. వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితి చక్కదిద్దాలని కోరారు. ఠాక్రే విజ్ఞప్తికి స్పందించిన మోదీ వెంటనే గవర్నర్‌ కోశ్యారీతో మాట్లాడి తాజా పరిస్థితులపై ఆరా తీశారు. ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేలా చూడాలని మోదీ కోరారు. ఈ క్రమంలోనే గవర్నర్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడంతో సీఈసీ ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.