Newdelhi, Aug 2: ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) (ED) తనపై దాడి చేసేందుకు ప్లాన్ చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. ఈ మేరకు ఈడీలో పనిచేస్తున్న కొందరు ఉన్నతాధికారులు తనకు సమాచారాన్ని చేరవేసినట్లు చెప్పారు. పార్లమెంట్ లో బీజేపీపై చక్రవ్యూహాం విమర్శలు చేసినందుకు .. ఈడీతో సోదాలు చేయాలన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు ఆయన ఆరోపించారు. శుక్రవారం వేకువజామున తన ఎక్స్ ఖాతాలో రాహుల్ గాంధీ ఈ విషయాన్ని తెలిపారు. అయితే ఈడీ తనిఖీలను ఎదుర్కొనేందుకు రిక్త హస్తాలతో ఎదురుచూస్తున్నట్లు రాహుల్ చెప్పారు. చాయ్, బిస్కట్ సిద్ధంగా ఉన్నట్టు చమత్కరించారు.
Apparently, 2 in 1 didn’t like my Chakravyuh speech. ED ‘insiders’ tell me a raid is being planned.
Waiting with open arms @dir_ed…..Chai and biscuits on me.
— Rahul Gandhi (@RahulGandhi) August 1, 2024
ఏమిటీ చక్రవ్యూహం?
కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడిని చక్రవ్యూహంతో ఆరు మంది ట్రాప్ చేసి చంపినట్టు.. అదే విధంగా ఇప్పుడు కూడా ఆరుగురు దేశాన్ని చక్రవ్యూహంలో బంధిస్తున్నారని బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాహుల్ అన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, మోహన్ భగవత్, అజిత్ దోవల్, ముఖేష్ అంబానీ, అదానీల నియంత్రణలో మనమంతా ఉన్నామని రాహుల్ అన్నారు. దేశాన్ని నడపడానికి ఈ ఆరుగురు మాత్రమే పనిచేస్తున్నారని విమర్శించారు.
భార్య వైఎస్ భారతితో కలిసి పాస్ పోర్ట్ రెన్యువల్ చేయించుకున్న మాజీ సీఎం జగన్