New Delhi, March 18: కాంగ్రెస్ లో రెబల్ నేతల స్వరం క్రమంగా పెరుగుతోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత వారు మరింత బాహాటంగా తిరుగుబాటు ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంతో కాంగ్రెస్ నేత రెబల్స్ (Congress Rebels) బృందం ప్రతినిధిగా సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ (Gulam nabi Azad) అధిష్టానంతో చర్చలకు సిద్ధమయ్యారు.ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో(Sonia Gandhi) సమావేశమయ్యారు. కాంగ్రెస్ (Congress) పార్టీని బలోపేతం చేయడంతో పాటూ, రానున్న రాజ్యసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సోనియాను కలిసినట్లు ఆజాద్ తెలిపారు. పార్టీలో అటు జాతీయస్థాయిలోనూ ఇటు ప్రాంతీయ స్థాయిలోను సంస్థాగత మార్పులు చేస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలకు ఎలా సన్నద్ధం అవ్వాలనే అంశంపై కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. ఢిల్లీలోని 10 జనపథ్‌లోని సోనియా నివాసంలో ఈ భేటీ జరిగింది. దాదాపు గంటపాటు ఇద్దరు పలు కీలక అంశాలపై చర్చించారు.

ఆజాద్ నేతృత్వంలోని G-23 కాంగ్రెస్‌ కోర్ గ్రూప్ సభ్యులు గురువారం జరిగిన సమావేశంలో పార్టీపై భిన్నాభిప్రాయాలు వ్యక్త పరిచిన నేపథ్యంలో నేటి వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. సోనియా గాంధీని కలిసిన అనంతరం కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ (Azad) మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధ్యక్షురాలితో సుదీర్ఘ భేటీ జరిగిందని అన్నారు. వచ్చే ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలి, పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి, ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ (Sonia Gandhi) కొనసాగనున్నారని, ఈ విషయాన్ని పార్టీ నేతలంతా అంగీకరిస్తున్నారని ఆజాద్ తెలిపారు.

Pegasus Spyware: దేశంలో మళ్లీ పెగాసస్ ప్రకంపనలు, చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు చేసిందని సంచలన వ్యాఖ్యలు చేసిన దీదీ, ఖండించిన తెలుగుదేశం పార్టీ

అయితే జీ23 నేత ప్రతినిధిగా సోనియాతో ఆజాద్ సమావేశమయ్యారని, తమ డిమాండ్లను ఆమె ముందుంచారని పలువురు చెప్తున్నారు. ముఖ్యంగా పార్టీ సంస్థాగత ఎన్నికలు, సీనియర్లకు ప్రాధాన్యత వంటి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కానీ ఆజాద్ మాత్రం పార్టీ బలోపేతంపై మాత్రమే చర్చ జరిగినట్లు చెప్తున్నారు.