Newdelhi, Sep 16: శ్రీరాముడి (Lord Ram) గాథను తెలిపే తులసీ దాస్ (Tulasidas) విరచిత రామచరిత మానస్ (Ramcharitmanas) గ్రంథంపై బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ (ఆర్జేడీ) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. రామచరిత మానస్ వంటి గ్రంథాల్లో పొటాషియం సైనైడ్ వంటి హానికర అంశాలు ఉన్నాయంటూ గురువారం ఓ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో ''అది నా ఒక్కడి అభిప్రాయమే కాదు. ప్రఖ్యాత హిందీ రచయిత నాగార్జున, సామాజికవేత్త రామ్ మనోహర్ లోహియ వంటి వారు రామచరిత మానస్ లో ఎన్నో తిరోగమన ఆలోచనలున్నాయన్నారు'' అని మంత్రి పేర్కొన్నట్లు ఉంది.
Nipah Virus on ICMR: కరోనా కంటే నిఫాతోనే మరణాల రేటు ఎక్కువ.. ఐసీఎంఆర్ డీజీ రాజీవ్ బహల్ వెల్లడి
RJD’s Chandra Shekhar compares Ramcharitmanas to potassium cyanide, stirs row https://t.co/AASUYqtESi
— Scroll.in (@scroll_in) September 15, 2023
ఇలా ముక్తాయింపు..
''పురాతన గ్రంథాల్లో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. అయితే మంచి విందులోని రుచికరమైన ఆహార పదార్థాలపై పొటాషియం సైనైడ్ చల్లితే వాటిని తినలేము కదా! అలాగే ఆ గ్రంథాల్లోని అంశాలు..'' అంటూ ముక్తాయించారు. దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఘనమైన సనాతన ధర్మాన్ని మంత్రి అవహేళన చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది.