Newdelhi, Sep 26: బీజేపీ (BJP) వాళ్లు రామ మందిరంపై బాంబులేసి (Bombs) ఆపై ముస్లింలను (Muslims) నిందించే అవకాశం ఉందంటూ కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడింది. వచ్చే ఎన్నికల్లో హిందువుల ఓట్ల కోసం బీజేపీ ఎంతకైనా తెగించే అవకాశం ఉందని ఆయన చేసిన వ్యాఖ్యల వీడియోను కర్ణాటక బీజేపీ ఎక్స్‌లో షేర్ చేసింది. పాటిల్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. హిందూ-ముస్లింల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా పాటిల్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
పాటిల్ ఏమన్నారంటే?
‘వచ్చే ఎన్నికల్లో మోదీ గెలవాలనుకుంటున్నారు. కాబట్టి హిందువుల ఓట్ల కోసం వారు (బీజేపీ) రామ మందిరంపై బాంబువేసి ఆ నెపాన్ని ముస్లిం సమాజంపై నెట్టేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది’ అని పాటిల్ మాట్లాడడం ఓ వీడియోలో స్పష్టంగా ఉంది. అయితే, ఆయన ఎప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారన్నది తెలియాల్సి ఉంది.