Newdelhi, Sep 26: కరోనాతో (Corona) కల్లోలాన్ని చవిచూసిన మానవజాతికి మరో కలవరం మొదలైంది. భవిష్యత్తులో కొవిడ్-19 (Covid-19) కన్నా భయంకరమైన మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముడుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. స్పానిష్ ఫ్లూతో కోట్లాది మంది చనిపోయినట్టే, ఈ కొత్త వైరస్ కారణంగా కనీసం 5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నదని బ్రిటన్ వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ కు నేతృత్వం వహించిన సైంటిస్టు కేట్ బ్రిఘం హెచ్చరించారు. జంతువుల్లో వైరస్ విస్తరిస్తుందని, మ్యుటేషన్లు ఏర్పడి మానవాళికి పెద్ద సవాల్‌గా మారుతుందని తాను రాసిన ఓ పుస్తకంలో బ్రిఘం వివరించారు. వైరస్‌ను ‘డిసీజ్ ఎక్స్’గా (Disease X) పేర్కొన్నారు. భవిష్యత్తులో మహమ్మారి రాబోతున్నదని డబ్ల్యూహెచ్‌వో 2018లోనూ హెచ్చరించింది.
The Next Pandemic: Disease X is deadlier than COVID-19, could kill 50 million people#Covid #COVID19 #pandemic https://t.co/UgwJjBEzrE
— Zee News English (@ZeeNewsEnglish) September 25, 2023
మరో హెచ్చరిక కూడా
జంతువుల నుంచి, ముఖ్యంగా గబ్బిలాల నుంచి వైరస్‌లు మానవులకు సోకుతుండటంపై పరిశోధనలు చేసి, ‘బ్యాట్‌వుమన్’గా ప్రసిద్ధి చెందిన చైనీస్ వైరాలజిస్ట్ షి ఝెంగ్లి సంచలన హెచ్చరిక చేశారు. భవిష్యత్తులో మరో కొత్త కరోనా వైరస్ పుట్టుకురావొచ్చని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని తెలిపారు.
Viral Video: వజ్రాల కోసం నడిరోడ్డుపై జనం వెతుకులాట.. ఎందుకలా?? వైరల్ వీడియో ఇదిగో!