Credits: X

Surat, Sep 26: గుజరాత్‌ (Gujarat)లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వజ్రాల (Diamonds) కోసం జనం నడిరోడ్డుపై వెతుకులాట ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. అదేంటి వజ్రాల కోసం నడిరోడ్డుపై వెతకడం ఏంటి అని అనుకుంటున్నారా..? ఇంతకీ ఏం జరిగిందంటే.. గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌ (Surat )లోని వరచ్చా ప్రాంతం (Varaccha area) వజ్రాల కొనుగోలు, అమ్మకానికి ప్రసిద్ధి గాంచింది. ఈ క్రమంలో ఓ వ్యాపారి పొరపాటున వజ్రాల ప్యాకెట్‌ను రోడ్డుపై పడేసుకున్నట్లు ఓ వార్త తెగ వైరల్‌ అయ్యింది. నడిరోడ్డుపై పడిపోయిన ఆ మూటలో రూ.కోట్లు విలువ చేసే వజ్రాలు ఉన్నట్లు ఓ మెసేజ్‌ చక్కర్లు కొట్టింది.

CRPF Voluntary Retirement: రోజుకు ఏడుగురు స్వచ్చంద పదవీవిరమణ.. ఉద్యోగాల్ని వీడుతున్న సీఆర్‌పీఎఫ్‌ అధికారులు

Weather Update: దేశంలో మొదలైన నైరుతి రుతుపవనాల తిరోగమనం, తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసిన ఐఎండీ

ఇది తెలుసుకున్న ప్రజలు ఆ ప్రాంతానికి చేరుకుని నడిరోడ్డుపై వజ్రాల కోసం వేట మొదలు పెట్టారు. రోడ్డుపై అనువనువూ గాలింపు చేపట్టారు. దీంతో ఆ ప్రాంతమంతా జనాలతో రద్దీగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.

హైదరాబాద్‌ నగరంలో ఒక్కసారిగా మారిన వాతావరణం, భారీ వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు, తెలంగాణవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం