Hyderabad, Sep 26: దేశ రక్షణలో భాగస్వాములవడం గర్వకారణంగా భావించి భారత సైన్యంలో (Indian Army) చేరినవారిలో చాలా మంది ఆవేదనతో సైన్యాన్ని వీడుతున్నారు. 2020 నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ (CRPF Voluntary Retirement) చేస్తున్న సైనికుల సంఖ్య 250 శాతం పెరిగింది. ఉగ్రవాదులు, నక్సలైట్లను మట్టుబెట్టి, శౌర్య పతకాలను పొందినవారు సైతం అయిష్టంగానే స్వచ్చంద పదవీవిరమణ (వీఆర్‌ఎస్) తీసుకుంటున్నారు.గడచిన మూడేండ్లలో రోజుకు సగటున ఏడుగురు సైనికులు లేదా అధికారులు సీఆర్‌పీఎఫ్‌ను వదిలిపెట్టారు. వీరి బాటలో పయనించాలనుకుంటున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే కనిపిస్తున్నది.
Since 2020, 7 CRPF Officials Are Taking Voluntary Retirement Every Day. Most Blame Job Stagnation | Exclusive https://t.co/DOff7J0LCm #crpf #India
— ridewithstocks (@tweetfortalk) September 25, 2023
కారణం ఇదే
ఎదుగుదల ఉండకపోవడంతోపాటు ఆరోగ్య, కుటుంబ సమస్యలు, మెరుగైన కెరీర్ అవకాశాలు తదితర కారణాల వల్ల వీఆర్‌ఎస్ తీసుకుంటున్నట్లు తెలుస్తున్నదని ప్రభుత్వం ఇటీవల పార్లమెంటుకు చెప్పింది.