Mumbai, November 26: మలుపులు తిరుగుతున్న మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాల్లో మరోసారి కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగుపడింది. శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP), కాంగ్రెస్ పార్టీలు కలిసి 'మహా వికాస్ అఘాడి' (Maha Vikas Aghadi)అనే పేరుతో ఒక కూటమిగా ఏర్పడి, తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మూడు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు మహా వికాస్ అఘాడి నాయకుడిగా ఉద్ధవ్ ఠాక్రేకు మద్ధతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు ఎన్‌సిపి చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు.
ముంబైలోని ట్రైడెంట్ ఫైవ్ స్టార్ హోటెల్ లో ఈరోజు మహా వికాస్ కూటమి ఎమ్మెల్యేలతో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉద్దవ్ ఠాక్రేను తమ కూటమి నాయకుడిగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఎన్సీపీ శాసనసభాపక్ష నేత జయంత్ పాటిల్, ఉద్దవ్ పేరును ప్రతిపాదించగా, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాసాహెబ్ తోరత్ ఆ ప్రతిపాదనను బలపరిచారు. ఈ తీర్మానానికి మూడు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలందరూ తమ మద్ధతు తెలిపారు. ఈ 'మహా' రాజకీయాలు భరించలేను మహాప్రభో, కాస్త సెలవిప్పించండి
ఇక భేటీ ముగియగానే మహా వికాస్ అఘాడి లోంచి మూడు పార్టీలకు చెందిన ముగ్గురు ప్రతినిధులు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని కలవడానికి బయలుదేరారు.
మూడు రోజుల ముచ్చటైన సీఎం పదవి, దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా
బుధవారమే విశ్వాస పరీక్ష ఉన్న నేపథ్యంలో ముందుగా నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక విశ్వాస పరీక్షలో ఈ కూటమి గెలుపు లాంఛనంగా కనిపిస్తుంది. నవంబర్ 28న సాయంత్రం 6:40 గంటలకు ముంబైలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పార్కులో ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనున్నట్లు ప్రకటించారు.