
Hyderabad, Aug 28: తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana Chief Minister) కె.చంద్రశేఖర్‌రావుపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశం బాగు కోసం పోరాడతారా? లేదంటే, బీజేపీకి మద్దతిస్తారా? ఏదో ఒక విషయాన్ని స్పష్టం చేయాలని కోరారు. కేసీఆర్ ఇండియా వైపు ఉంటారో, లేదంటే ఎన్డీయే వైపు ఉంటారో తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. దేశం వైపు ఉండాలనుకుంటే ‘ఇండియా’లో చేరాలని, బీజేపీతో ఉంటే ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించాలని కోరారు. అంతేకానీ, ఓట్లను మాత్రం చీల్చొద్దని హితవు పలికారు. మహారాష్ట్రలో పోటీ చేయడం సంగతి అటుంచి తొలుత తెలంగాణలో పరిస్థితులను చక్కదిద్దుకోవాలని సలహా ఇచ్చారు.
