
Newdelhi, Nov 17: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో (Five States Assembly Elections) భాగంగా మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) పోలింగ్ (Polling) ప్రారంభమైంది. రాష్ట్రంలోని మొత్తం 230 స్థానాలకు ఒకే ఒకే విడుతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 7 గంటలకు పోలింగ్ షురూ అయింది. మొత్తం 5,60,58,521 మంది తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వారిలో మహిళా ఓటర్లు 2.72 కోట్ల మంది కాగా, పురుష ఓటర్లు 2.88 కోట్ల మంది ఉన్నారు. వీరికోసం 64,626 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా, ఈ సారి 22.36 లక్షల మంది యువతీయువకులు మొదటిసారిగా తమ ఓటుహక్కును వినియోగించుకోబోతున్నారు.
Lizard Inside Samosa: సమోసాలో బల్లి.. తినబోయి షాకైన వ్యక్తి.. వైరల్ వీడియో ఇదిగో
2534 మంది అభ్యర్థులు పోటీలో
మొత్తం 230 స్థానాలకుగాను 2534 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారిలో 252 మంది మహిళలు ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొన్నది. బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుండగా, ఈసారైనా పూర్తి మెజార్టీతో మధ్యప్రదేశ్ అసెంబ్లీని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నది. ఛత్తీస్ గఢ్ తుది విడుత పోలింగ్ కూడా ఈరోజే మొదలైంది. ఇరు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్నాయి.
Sabarimala Temple: నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం.. 41 రోజులపాటు శబరిమల యాత్ర సీజన్