Marriage| Representational Image (Photo Credits: unsplash)

మహిళల చట్టబద్ధమైన వివాహ వయస్సును 18 నుండి 21 సంవత్సరాలకు పెంచే ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ఆమోదించడం దేశ వ్యాప్తంగా పలు చర్చలకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ నేతలు చేసిన వివాదస్పదంగా మారాయి. ఎస్పీ పార్లమెంటు సభ్యులు తుఫైల్ హుస్సేన్‌ ఆడపిల్లలకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడాన్ని సమర్థించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించేందుకు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ దూరంగా నిలిచారు.

పూర్తి వివరాల్లోకి వెళితే ఆడపిల్లలకు సంతానోత్పత్తి వయసు రాగానే పెళ్లి చేయాలని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ సయ్యద్ తుఫైల్ హసన్ అన్నారు. “మహిళల సంతానోత్పత్తి వయస్సు 16-17 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ఉంటుంది. 16 సంవత్సరాల వయస్సులో వివాహ ప్రతిపాదనలు రావడం ప్రారంభమవుతాయి. వివాహం ఆలస్యం అయితే, వంధ్యత్వానికి అవకాశం ఉంది. రెండవది వృద్ధాప్యంలో ఉన్నప్పుడు పిల్లలు స్థిరపడరు. ఇది సాధారణ జీవితం చక్రాన్ని విచ్ఛిన్నం చేస్తుంది అని విమర్శించారు. అమ్మాయికి రజస్వల అయ్యి, సంతానోత్పత్తి వయసు వచ్చేసరికి పెళ్లి చేసుకోవాలనేది తన నమ్మకం అని అన్నారు. అమ్మాయికి 16 ఏళ్లు నిండితే 16 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చు.. 18 ఏళ్లకే ఓటు వేయగా లేనిది, పెళ్లి ఎందుకు చేసుకోకూడదు?” అని తుఫైల్ హసన్ ప్రశ్నించారు.

ఈ విషయంపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ షఫీకర్ రహ్మాన్ బార్క్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ కుమార్తెకు చిన్న వయస్సులోనే వివాహం చేయాలని కోరుకుంటారు. ఈ బిల్లుకు పార్లమెంటులో మద్దతు ఇవ్వము” అని అన్నారు. ఇదిలావుంటే, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తర్వాత అలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉన్నారు. తమ పార్టీ ప్రగతిశీలమని, మహిళలు, బాలికల సంక్షేమం అభివృద్ధికి అనేక పథకాలను ప్రారంభించిందని స్పష్టం చేశారు. ఇలాంటి ప్రకటనలతో సమాజ్‌వాదీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు.

ఇదిలావుంటే, గత ఏడాది స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోడీ ఈ ప్రతిపాదనను ప్రస్తావించారు.”ఈ ప్రభుత్వం కుమార్తెలు, సోదరీమణుల ఆరోగ్యం గురించి నిరంతరం శ్రద్ధ వహిస్తుంది. పోషకాహార లోపం నుండి కుమార్తెలను రక్షించడానికి, వారికి సరైన వయస్సులో వివాహం చేయడం అవసరం” అని ప్రధాన మంత్రి అన్నారు. కాగా, ప్రస్తుతం పురుషుల కనీస వివాహ వయస్సు 21 ఏళ్లు అయితే మహిళలకు 18 ఏళ్లు. ఇద్దరు వ్యక్తులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేయగా, పార్టీ రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్ ఈ చర్యను స్వాగతించారు. “ఇది మంచి నిర్ణయం. దీని వల్ల బాలికలు మరింత చదువుకునే అవకాశం ఉంటుంది. వారు తమ స్వాతంత్య్రాన్ని ఆస్వాదించగలుగుతారు. వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి” అని ఆమె అన్నారు.