Jaipur, NOV 16: రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గుర్మీత్ సింగ్ కూనర్(75) (Gurmeet Singh Kooner Dies) మృతి చెందారు. రాజస్థాన్‌లోని కరణ్‌పూర్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ తరపున గుర్మీత్ సింగ్ కూనర్ పోటీ చేస్తున్నారు. బుధవారం ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో చికిత్స పొందుతూ కూనర్ మరణించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పది రోజుల ముందు ఆయన మరణించారు. గుర్మీత్ సింగ్ కూనర్ (Gurmeet Singh Kooner Dies) నవంబర్ 12 సాయంత్రం 5 గంటలకు ఎయిమ్స్‌లోని జెరియాట్రిక్ మెడిసిన్ వార్డులో చేరారు. బుధవారం ఉదయం 6:25 గంటలకు మరణించినట్లు ఆస్పపత్రి జారీ చేసిన డెత్ సర్టిఫకేట్ లో పేర్కొన్నారు. కూనర్ కిడ్నీ జబ్బులు మరియు హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నాడు.
Rajasthan: Congress candidate Gurmeet Singh Kooner passes away
Read @ANI | https://t.co/afxNbYH2eO#Gurmeetsingh #Congress #Rajasthan pic.twitter.com/s8OAG8j6vv
— ANI Digital (@ani_digital) November 15, 2023
గంగానగర్ జిల్లాలోని కరణ్‌పూర్ (Karanpur) నుంచి కూనర్ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కూనర్ 1998లో కాంగ్రెస్ టిక్కెట్‌పై మొదటిసారి కరణ్‌పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2008లో స్వతంత్ర అభ్యర్థిగా, ఆపై 2018లో మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. రెండో సారి ఏర్పాటైన అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంలో (2008-13), కూనర్ రాష్ట్ర మంత్రిగా వివిధ శాఖలను నిర్వహించారు.